వచ్చేనెల జరగబోతున్న సాధారణ ఎన్నికల స్థాయిని తలపించే విధంగా నిన్న జరిగిన ‘మా’ ఎన్నికల ఫలితాలు ఈరోజు తెల్లవారుజామున ప్రకటించారు. ఎప్పుడు లేని విధంగా ఈసారి అత్యధిక స్థాయిలో 472 ఓట్లు పోల్ అవ్వడంతో ఈ అత్యధిక పోలింగ్ ఎవరికీ అనుకూలం అన్న రకరకాల అంచనాల మధ్య ఈ ఎన్నికల ఫలితం గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు.
రెండు వర్గాల్లోనూ ఆందోళన
సీనియర్ యాక్టర్ నరేశ్ జీవిత రాజశేఖర్ లు జతకట్టిన ప్యానల్ కు అత్యధిక ఓట్లు రావడమే కాకుండా కీలక పదవులు ఈ ప్యానల్ కు వచ్చాయి. ఎస్.వి.కృష్ణారెడ్డి నటి హేమ ఉపాధ్యక్షులుగా ఎన్నిక అయితే చిరంజీవికి అత్యంత సన్నిహితుడుగా పేరు గాంచిన శ్రీకాంత్ ఈ ఎన్నికలలో ఓడిపోవడం ఒక ట్విస్ట్. 

ఇక అనేక వివివాదాలకు చిరునామాగా కొనసాగిన శివాజీ రాజ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఎన్నికలలో అతడిని విజయం వరించలేదు. ఒకనాటి యాంగ్రీ యంగ్ మేన్ హీరో రాజశేఖర్ చేతిలో శ్రీకాంత్ కు పరాభవం ఎదురైంది. శివాజీ రాజ టీమ్ గురించి నరేశ్ జీవితా రాజశేఖర్ లు ఓపెన్ గా చేసిన ఆరోపణలు చాలామంది ‘మా’ ఓటర్లను ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. 
MAA to boycott Filmfare awards
ఇప్పటికే ప్రతిసారి ‘మా’ సంస్థ ఎన్నికలు జరిగే సందర్భంలో ఈ సంస్థకు సొంత భవనం ఏర్పరుస్తాం అన్న వాగ్దానం వస్తోంది. దీనితో నరష్ ప్యానల్ అయిన ఈవిషయాన్ని సీరియస్ గా తీసుకుని ముఖ్యంగా అవకాశాలు లేక ఆర్ధిక అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న చిన్న స్థాయి నటులకు ఎంత వరకు నరేశ్ జీవితా రాజశేఖర్ లు ఇచ్చిన మాట ప్రకారం తమ వాగ్దానాలను నిలబెట్టుకుంటారో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: