రాజమౌళితో ‘ఆర్ ఆర్ ఆర్’ స్టోరీని బయటపెట్టి కొన్ని గంటలు కూడ కాకుండానే ఈమూవీ కథకు ఎంతవరకు తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు అన్న విషయంలో అప్పుడే సందేహాలు తలెత్తుతున్నాయి. దీనికి కారణం రాజమౌళి ఈరోజు ఈమూవీ కథను వివరిస్తూ ఇచ్చిన లీకులు అల్లూరి స్పూర్తిలో ఉండే పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తే కొమరం భీమ్ స్పూర్తిగా ఉండే పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించ బోతున్నాడు అన్న సంకేతాలు రాజమౌళి నుండి వచ్చాయి. 
ఫిక్షనల్ కథ... అల్లూరిగా రామ్ చరణ్, కొమురం భీంగా తారక్
అయితే కథకు సంబంధించి ఊహ బాగానే ఉన్నా ఈ రెండు పాత్రలను మన దక్షిణాది ప్రాంత పాత్రలుగా కాకుండా ఉత్తరాది నేపధ్యంలో కనిపిస్తాయి అన్న రాజమౌళి మాటలతో ఈమూవీలో ఉత్తరాది ప్రాంత వాతావరణం చూడబోతున్నామా అన్న సందేహాలు వస్తున్నాయి. అంతేకాదు రాజమౌళి ఇలాంటి లీకులు ఇవ్వడం వెనుక ఈసినిమాకు సంబంధించి బాలీవుడ్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన కామెంట్స్ అని అంటున్నారు. 
కథ అప్పుడే
కేవలం మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు తప్ప ఉత్తరాది ప్రాంతం వారికి అల్లూరి కొమరం భీమ్ పాత్రలు పెద్దగా తెలియవు. ఈమూవీ కథ అంతా 1920 నాటి బ్రిటిష్ కాలం నాటి కథతో సాగుతుందని రాజమౌళి చెపుతున్నా అల్లూరి సీతారామరాజు కొమరంభీం కథలకు సంబంధించిన స్పూర్తి తెలుగు ప్రేక్షకులకు అర్ధం అవుతుంది కానీ ఉత్తరాది ప్రాంత ప్రేక్షకులకు ఎలా అర్ధం అవుతుంది అన్న సందేహాలు మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. 
వేరే ఊరు వెళుతున్నా
అంతేకాదు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఈ ఇద్దరి మహనీయులు మనకు తెలియని సమయంలో వారిద్దరూ కలిసి ఒకరి కొకరు ఇన్‌స్పిరేషన్ అయి ఉంటె వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడితే అన్న ఊహల చుట్టూ అల్లబడిన కథ వినడానికి బాగున్నా ఆ కథను చెప్పే విషయంలో ఏమాత్రం కన్ఫ్యూజ్ అయినా పూర్తిగా ప్రేక్షకులు  అసహనానికి లోనవుతారు అన్న కామెంట్స్ అప్పుడే మొదలైపోయాయి. దీనికితోడు ‘బాహుబలి’ కథ ఒక ఊహాజనితమైన అలనాటి రాజుల కథ కానీ ‘ఆర్ ఆర్ ఆర్’ విషయం వచ్చేసరికి ఊహతో కథ చెపుతున్నా స్వాతంత్రోద్యమ కాలంలోకి ప్రేక్షకులను రాజమౌళి తీసుకు వెళ్ళి తీరాలి. ఈ స్ఫూర్తి కేవలం భారీ సెట్టింగ్స్ వల్ల రాదు. కేవలం కథలో జాతీయతా భావం దేశభక్తి మూవీలో అణువణువునా కనిపించినప్పుడు మాత్రమే రాజమౌళి కృషికి విజయం దక్కుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: