వర్మ తీస్తున్న సినిమా టీడీపీకి వ్యతిరేకంగా ఉందని దానిని అడ్డుకునేందుకు ఈసీ కి కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల మొదటి దశ పూర్తి అయ్యేవరకు సినిమా విడుదలను అడ్డుకోవాలని ఈసీని టీడీపీ నాయకులు కోరిన విషయం కూడా తెల్సిందే. సినిమాపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని అంతా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న సమయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పందించారు.

Image result for ec rajat kumar

సినిమా విడుదలను అడ్డుకోవడం కుదరదని అయితే సినిమా విడుదల తర్వాత అందులో ఎవరికైనా అనుకూలంగా సన్నివేశాలు ఉన్నాయా? ఓటర్లను ప్రభావితం చేసే విధంగా సన్నివేశాలు ఉన్నాయా ? ఎన్నికల కోడ్ ఉల్లంఘించే విధంగా అందులో ఏమైనా కంటెంట్ ఉందా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని అప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉందని ముందే చర్యలు తీసుకోవడం కుదరదంటూ టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై రజత్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.

Image result for ec rajat kumar

రజత్ కుమార్ మాటలతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా అనుకున్నట్లుగా ముందు నుండి ప్రచారం చేస్తున్నట్లుగా వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రజత్ కుమార్ సినిమా విడుదలను అడ్డుకోలేం అంటూ చేసిన వ్యాఖ్యలను వర్మ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. తెలుగు దేశం పార్టీ నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సినిమాను ఆపడం వారి వల్ల కాదు అంటూ వర్మ మళ్లీ మళ్లీ చెబుతూ వస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: