నాగచైతన్య, సమంత.. టాలీవుడ్‌లో క్యూట్ జంట.. ఈ జంట చాలా రోజుల తర్వాత జంటగా నటిస్తున్న చిత్రం మజిలీ.. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలైంది. అయితే ఇందులో నాగచైతన్య మరో హీరోయిన్ ను ముద్దు పెట్టుకున్న దృశ్యాలు వేడెక్కించాయి. 

naga chaitanya kiss కోసం చిత్ర ఫలితం


మజిలీ చిత్రంలో దివ్యాంశా కౌశిక్‌ మరో హీరోయిన్ గా నటిస్తోంది. సమంతా హీరోయిన్ గా నటిస్తున్న సినిమాలో మరో హీరోయిన్ తో నాగ చైతన్య రోమాన్స్ అందులోనూ లిప్ కిస్సులు ఉండటం హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై సమంత ఎలా స్పందిస్తుందన్నది ఇంట్రస్టింగ్ గా మారింది. 

సంబంధిత చిత్రం

ఇదే ప్రశ్న ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంతకు ఎదురైంది. నటనలో ఇవన్నీ భాగమే అంటూ సమంత ఒక్క ముక్కలో కొట్టిపారేసింది. నటనకు, నిజానికి మధ్య చిన్న గీత ఉంటుందంటున్న సమంత.. తనవరకూ ముద్దుపెట్టుకోవడం, కౌగిలించుకోవడం కూడా నటనే అని సమంత చెప్పింది.

naga chaitanya kiss కోసం చిత్ర ఫలితం

నటులెవరైనా ఇదే రూల్‌ వర్తిస్తుందని సమంత వివరించింది. అంతే కాదు.. తనకూ నాగచైతన్యకూ మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉందని.. ఇలాంటి సీన్లు చూసి ఫీలయ్యే టైపు తాను కానే కాదని కుండబద్దలు కొట్టేసింది. ఎంతైనా ప్రొఫెషనల్‌ నటిగా సమంత తన ప్రత్యేకత మరోసారి నిలబెట్టుకుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: