తెలుగు సీనియర్ నటుడు, ప్రముఖ విలన్ కోట శ్రీనివాసరావు మరోసారి ఫైర్ అయ్యారు. తెలుగు నటులకు సరైన వేషాలు లభించడం లేదని తరచూ ఆవేశపడే కోట శ్రీనివాసరావు ఇప్పుడు అదే ఆవేశంలో ఓ నటుడిని ప్రత్యేకించి పేరు పెట్టి ఘాటువిమర్శలు చేశారు. 

kota srinivasa rao on sayaji shinde కోసం చిత్ర ఫలితం


మా అసోషియేషన్ కొత్త అధ్యక్షుడిగా నరేశ్ ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కోట శ్రీనివాసరావు ఆలోచింపజేసే ప్రసంగం చేశారు. మా సంస్థకు ఎంత‌మంది కొత్త అధ్యక్షులు వ‌చ్చినా తెలుగులో తెలుగు న‌టుల భ‌విష్యత్తు మార్చలేక‌పోతున్నారంటూ బాధపడ్డారు.  

kota srinivasa rao on sayaji shinde కోసం చిత్ర ఫలితం

ప‌ర‌భాషా న‌టుల‌ను విమానాల్లో తీసుకొచ్చి.. వాళ్లకు ల‌క్షలకు ల‌క్షలు ఇచ్చి.. నెత్తిన పెట్టుకుంటున్నారని.. ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాదని కోట ఆవేదన వ్యక్తం చేశారు. అస‌లు న‌ట‌న కూడా రాని మొహాల‌ను తీసుకొచ్చి ఇక్కడ జనం నెత్తిన రుద్దుతుంటే క‌డుపు కాలిపోతుంద‌ని ఆవేశపడ్డారు కోట. 

kota srinivasa rao on sayaji shinde కోసం చిత్ర ఫలితం

ఇందుకు ఉదాహరణగా సాయాజీ షిండే పేరు ప్రస్తావించారు కోట. అసలు ఆయన నటుడేనా అంటూ మండిపడ్డారు. తెలుగు నటులకు క‌నీసం నెల‌లో 12 రోజులైనా  వేషాలు దొరికేలా చేస్తే కృష్ణాన‌గ‌ర్ ద‌గ్గర ఎంతోమంది జీవితాలకు కాస్త అన్నం దొరుకుతుంద‌ని అన్నారు కోట. ఆవేశంతో చెప్పినా కోట మాటల్లో అర్థం ఉంది కదా.



మరింత సమాచారం తెలుసుకోండి: