నిన్న మోహన్ బాబు తన శ్రీ విద్యానికేతన్ కు సంబంధించి ఫీజ్ రీ-ఎంబర్స్ మెంట్ విషయంలో జరిగిన అన్యాయాన్ని నిలదీస్తూ తన విద్య సంస్థ విద్యార్ధులతో కలిసి నిర్వహించిన నిరశన కార్యక్రమం మీడియాకు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోహన్ బాబు ఇలా నిరశన కార్యక్రమం చేపట్టడమే కాకుండా ఒకనాటి ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు సంఘటనను మళ్ళీ తన మాటల ద్వారా గుర్తుకు చేయడంతో తెలుగుదేశం ముఖ్యనాయకులలో గుబులు పుట్టిస్తున్నట్లు సమాచారం.
actor sivaji sensational comments on mohan babu
ఇలాంటి పరిస్థుతులలో నటుడు శివాజీ రంగంలోకి దిగి మోహన్ బాబును టార్గెట్ చేస్తూ చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. శ్రీవిద్యా నికేతన్ సంస్థకు ఫీజు రీ-ఎంబర్స్ మెంట్ కు సంబంధించి ఉద్యమాలు చేస్తున్న మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంతా స్పెషల్ స్టేటస్ గురించి ఉద్యమాలు చేస్తూ రోడ్డుమీదకు వచ్చినప్పుడు మోహన్ బాబు ఎందుకు స్పందించ లేదు అని ఎదురు ప్రశ్నలు వేసాడు శివాజీ. 

అంతేకాదు రాజకీయాల పై అవగాహన ఉండి నిస్వార్ధ పరుడుగా పేరు గాంచిన మోహన్ బాబు లాంటి చైతన్యం ఉన్న వ్యక్తులు కూడ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన స్పెషల్ స్టేటస్ ఉద్యమం పై కాని ఆసమయంలో అన్యాయంగా విద్యార్ధుల పై జరుగుతున్న అరెస్ట్ లు గురించి కానీ ఎందుకు స్పందించలేదు అంటూ శివాజీ మోహన్ బాబు ప్రశ్నించాడు. ఇదే సందర్భంలో శివాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు అవుతున్న నేపధ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఏవిషయంలోను నిధులు విడుదల చేయలేదు అన్న విషయం మోహన్ బాబుకు తెలియదా అంటూ ప్రశ్నించాడు.  
Watch: Sivaji's Hollow Knowledge Exposed
కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ కు రాజకీయంగా లాభం చేయాలనీ మోహన్ బాబు ఈ ఎన్నికల వేళ ఇలాంటి నిరశన దీక్షలు చేసాడు కాని ఈ దీక్షలో ఎటువంటి నిజాయితీ లేదు అంటూ శివాజీ మోహన్ బాబు వ్యక్తిత్వం పై ప్రశ్నలు వేస్తున్నాడు. ఇది ఇలా ఉండగా శ్రీవిద్యా నికేతన్ కు ఫీజు రీ-ఎంబర్స్ విషయంలో చెల్లించవలసిన బకాయిలు ఇప్పటికే చాలావరకు చెల్లించేసాము అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడంతో మోహన్ బాబు ఎందుకు ఈ నిరశన ఇప్పుడు చేపట్టాడు అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: