గతంలో ఎన్నో సార్లు ఓటర్ల లీస్టులో సెలబ్రెటీల ఫోటోలు రావడం చూశాం..అధికారుల తప్పిదాల వల్ల జరిగే ఇలాంటి పొరపాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ లిస్ట్‌పై ఇప్పటికే ఎన్నో అనుమానాలున్నాయి.  ఓట‌ర్ల లిస్ట్‌లో కొత్త వారిపేర్లు చేర్చ‌డం….లేని వారి పేర్లు తీసేయ‌డం జరిగింది.  చ‌నిపోయిన వ్య‌క్తికి ఓట‌ర్ల జాబితాలో చోటు ఇవ్వ‌డం.. చ‌నిపోయిన వ్య‌క్తి వ‌చ్చి ఓటేయ‌డం ఇవ‌న్నీ ఎన్నిక‌ల స‌యంలో జరిగే చిత్రాలే.  ఇప్ప‌టికే రాష్ట్రంలో ఓట్ల తొల‌గింపుపై అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య ఓమోస్త‌రుయుద్ద‌మే జ‌రుగుతోంది.

తాజాగా మరోసారి అధికారుల తప్పిదం జరిగింది.   వివ‌రాల‌లోకి వెళితే రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో దీపికా ప‌దుకొణే పేరుతో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఫోటో ప్ర‌త్య‌క్షం అయింది.   దీపికా ప‌దుకొణే తండ్రి పేరు ర‌మేష్ కొండా అని ఆమె వ‌య‌స్సు 22 అని ప్రింట్ చేశారు. ఇంటి పేరు కూడా ఆ లిస్ట్ లో ముద్రించ‌డంతో ఎన్నిక‌ల అధికార్లు ఎంత సక్ర‌మంగా ప‌నులు చేస్తున్నారో అర్ధ‌మ‌వుతుంది అని ఓట‌ర్లు మండిప‌డుతున్నారు. 

అయితే, దీపికా పేరున్నా… ఫొటో మాత్రం టాలీవుడ్ అందాలభామ కాజల్ అగర్వాల్‌ది కావడం మరో విశేషం.  ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ ఫొటోతో పద్మావతి అనే మహిళకు ఓటు హక్కు ఇచ్చిన విష‌యం విదిత‌మే. స్థానికి ప్ర‌జ‌లు అధికారుల‌పై సీరియస్ అవుతున్నారు. దీంతో త‌మ త‌ప్పుని స‌రిదిద్దుకొనే ప‌నిలో ప‌డ్డారు అధికారులు.


మరింత సమాచారం తెలుసుకోండి: