'ఆర్ ఆర్ ఆర్' విషయంలో రాజమౌళి ప్రతి చిన్న విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈమూవీ కథ చాల భాగం 1920 కాలం నాటి స్వాతంత్రోద్యమ నేపధ్య్మలో జరుగుతున్న సందర్భంలో అప్పటి భవనాలు అదేవిధంగా అప్పటి ఫర్నేచర్ కార్లు ఇలా ప్రతి చిన్న విషయంలోనూ సహజత్వం ఉండటమే కాకుండా ఈమూవీని థియేటర్లలో చూసే వారికి అలనాటి 1920 కాలంలో తాము కూడ జీవిస్తున్నామా అన్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగేలా రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర ను చిత్రీకరిస్తున్నాడు.

రాజమౌళి బ్రాండ్ పై బాలీవుడ్ మీడియా షాకింగ్ కథనం
ముఖ్యంగా 1920 కాలంనాటి జమీందారీ సాంప్రదాయానికి అనుగుణంగా అప్పుడు ఆకాలంలోని ధనవంతులు వాడే కార్లను ఈసినిమా కోసం ఉపయోగిస్తున్నారు రాజమౌళి. అలాంటి రాజసం ఉట్టిపడే కార్లు ఎక్కువగా ఉత్తరాది ప్రాంతంలో బాగా ఉండటమే కాకుండా అలాంటి కార్లను అద్దెకు ఇచ్చే కొన్ని రాజస్థానీ కుటుంబాలు ఇదే బిజినెస్ లో ఉన్నాయి. 

రాజమౌళి బ్రాండ్ పై బాలీవుడ్ మీడియా షాకింగ్ కథనం
అయితే 'ఆర్ ఆర్ ఆర్' విషయంలో రాజమౌళికి కావలసిన అలనాటి వింటేజ్ కార్ల అద్దె ఒక చిన్న హీరో పారితోషికానికి సమానం అయిపోవడంతో ఈ కార్ల సమస్యను ఎలా పరిష్కరించాలి అని రాజమౌళి ఆలోచిస్తున్నప్పుడు బెంగుళూర్ లో ఉంటున్న డాక్టర్. రవిప్రకాష్ పేరును కొందరు రాజమౌళికి సూచించారట. రవి ప్రకాష్ దగ్గర అత్యంత ఖరీదైన అలనాటి 225 వింటేజ్ కార్లు ఉన్నప్పటికీ సినిమా షూటంగ్ లకు అద్దెకు ఇవ్వడం రవిప్రకాష్ కు నచ్చదట. 

రాజమౌళి బ్రాండ్ పై బాలీవుడ్ మీడియా షాకింగ్ కథనం
అయితే కేవలం వింటేజ్ కార్లు కొనడం అతడికి ఒక హాబీగా మారడంతో అతడి పేరు దేశవ్యాప్తంగా చాలామందికి తెలుసు. రాజమౌళి ఈవిషయాలు అన్నే తెలుసుకుని డాక్టర్. రవిప్రకాష్ దగ్గరకు వెళ్ళి తాను తీస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' మూవీ విషయాన్ని వివరించి కొంతకాలం రవిప్రకాష్ దగ్గర ఉన్న వింటేజ్ కలక్షన్ లో కొన్ని కార్లను ఎంపిక చేసుకుని 'ఆర్ ఆర్ ఆర్' షూటింగ్ కోసం చాల తెలివిగా జక్కన్న రవిప్రకాష్ ను ఒప్పించినట్లు టాక్. దీనితో .ఎలాంటి వ్యక్తిని అయినా సున్నితంగా ఒప్పించే నైపుణ్యం రాజమౌళికి పుష్కలంగా ఉంది అన్న విషయం మరొకసారి రుజువైంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: