రామ్ గోపాల్ వర్మ ఈవారం విడుదల కాబోతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ను ప్రమోట్ చేస్తూ అనేక షాకింగ్ విషయాలు బయటపెడుతున్నాడు. ఎన్టీఆర్ జీవితంలోని చివరి రోజుల్లో ఏం జరిగిందని తాను భావిస్తున్నానో ఆ విషయాలనే తాను తన సినిమాలో చూపెడుతున్నాను అంటూ ఈమూవీకి హైక్ క్రియేట్ చేస్తున్నాడు వర్మ. 
A still from Lakshmi's NTR
అయితే ఈసినిమా మేకింగ్ వెనుక పరోక్షంగా బాలకృష్ణ సహాయం ఉంది అంటూ వర్మ మరొక కొత్త సంచలన విషయానికి తెర తీసాడు. వాస్తవానికి ఎన్టీఆర్ బయోపిక్ తన చేత దర్శకత్వం చేయించాలని బాలకృష్ణ అప్పట్లో చేసిన ప్రయత్నాలు వివరిస్తూ తాను ఎన్టీఆర్ జీవితంలో జరిగిన సంచలన సంఘటనలు ఎన్టీఆర్ బయోపిక్ లో ఉండాలి అని తాను పట్టు పట్టడంతో తనకు బాలయ్యకు మధ్య అప్పట్లో ఏర్పడిన అభిప్రాయ భేదాలు బయట పెట్టాడు.
Lakshmi's NTR
గతంలో కొద్ది రోజులపాటు తనకు బాలయ్యతో చర్చలు జరుగుతున్న పరిస్థుతులలో ఎన్టీఆర్ కు సన్నిహితులైన కొందరు వ్యక్తులను అప్పట్లో తనకు పరిచయం చేసిన విషయాన్ని వర్మ బయటపెట్టాడు. అయితే  తాను బాలకృష్ణ పరిచయం చేసిన ఎన్టీఆర్ సన్నిహితులతో మాట్లాడుతున్నప్పుడు తమ మాటల మధ్య ఎన్టీఆర్ చివరి రోజులలో జరిగిన సంఘటనలను మాట వరసకు తనకు చెప్పారనీ ఆవిషయాలను బట్టి తాను ఎన్టీఆర్ చివరి రోజులను ఊహించుకున్నాను అని అంటున్నాడు వర్మ. 

దీనితో తన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' స్క్రిప్ట్ కు బాలకృష్ణ అనుకోకుండా సహాయం చేసినట్లు అయిందనీ అందువల్లనే ఈమూవీ టైటిల్ కార్డ్స్ లో తాను నందమూరి బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలియచేసాను అన్న షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు. అయితే తన కృతజ్ఞతలు స్వీకరించడం స్వీకరించకపోవడం అన్నది బాలకృష్ణ పై ఆధారపడి ఉంటుంది అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు. ఇది ఇలా ఉండగా ఈసినిమా రిలేజ్ ను నిలిపి వేయమని కొందరు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆఖరి ప్రయత్నంగా రేపు సుప్రీం కోర్టులో పిల్ వేయబోతున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: