సౌత్ లో టాప్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న సమంత పెళ్లి తర్వాత కూడా వరుస అవకాశాలను అందుకుంటుంది. ఏ హీరోయిన్ అయినా పెళ్లి తర్వాత ఆఫర్లు ఖాళీ అవుతాయి కాని సమంత మాత్రం పెళ్లి తర్వాత కూడా మునుపటి ఫాంను కొనసాగిస్తుంది. ఇలా చేయడం ఒక్క సమంతకు మాత్రమే సాధ్యమైందని చెప్పొచ్చు.   


ప్రస్తుతం సమంత కోలీవుడ్ లో సూపర్ డీలక్స్ సినిమా చేస్తున్నాడు. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సమంత వేశ్య పాత్రలో కనిపిస్తుందట. ముందు ఈ పాత్ర కోసం ఓ ఇద్దరు టాప్ హీరోయిన్స్ ను అడిగారట. కాని వారిద్దరు చేయమని చెప్పడంతో సమంత దగ్గరకు వచ్చిందట. రమ్యకృష్ణ కూడా ఈ సినిమాలో పోర్న్ స్టార్ గా చేస్తుంది.


ఇంతకీ సమంత చేయాల్సిన పాత్రని కాదన్న ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. కెరియర్ లో ఎలాంటి రోల్ అయినా సరే ఛాలెంజింగ్ గా చేస్తూ వస్తున్న సమంత వేశ్యగా కూడా ఇంప్రెస్ చేస్తుందని అన్నారు. ఈ సినిమాలో ఛాన్స్ రాగానే తన పాత్ర విన్ని చైతు షాక్ అయ్యాడని కాని కథ విన్నాక ఓకే చెప్పాడని చెప్పింది సమంత.


తెలుగులో సమంత నాగ చైతన్యతో మజిలి సినిమా చేస్తుంది. శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది. పెళ్లి తర్వాత సమంత కెరియర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. మజిలితో పాటుగా ఓ బేబీ సినిమాలో నటిస్తుంది సమంత. నందిని రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: