ఏ భాషలో సినిమా వచ్చినా.. ఎన్ని రికార్డులు.. ఎన్ని రివార్డులు తెచ్చుకున్నా సినిమా ప్రపంచంలో అకడెమీ అవార్డుకు ఉండే క్రేజే వేరు.. ఇండియన్ సినిమాకు ఆస్కార్ కల అందని ద్రాక్షలానే ఉంది. లాస్ట్ ఇయర్ ఓ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డ్ రాగా.. స్లం డాగ్ మిలీనియర్ సినిమాకు సంగీతానికి రెహమాన్ ఆస్కార్ అవార్డ్ అందుకున్నాడు.


అయితే ఇప్పుడు ఆ ఆస్కార్ కల నెరవేర్చేందుకు రాజమౌళి కృషి చేస్తున్నాడని తెలుస్తుంది. బాహుబలి సినిమాతో తన సత్తా చాటి తెలుగు సినిమా ప్రపంచ దేశాల స్థాయిని అందుకునేలా చేశాడు. ఇక ఇండియన్ సినిమా రికార్డుల్లో బాహుబలి సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. అందుకే ఈసారి అంతకుమించి ఉండేలా ఆర్.ఆర్.ఆర్ తెరకెక్కిస్తున్నాడు.


ఇద్దరు రియల్ హీరోస్ కథతో ఆర్.ఆర్.ఆర్ వస్తుంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించాలని చూస్తున్నాడు రాజమౌళి. 400 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఉండేలా చేస్తున్నాడట.


అందుకే ఆర్.ఆర్.ఆర్ తో ఆస్కార్ అవార్డుకి గురి పెట్టాడని అంటున్నాడు. అవార్డ్ తెచ్చినా తీసుకురాకున్నా కనీసం నామినేషన్ అయినా సాధించేలా ప్లాన్ చేస్తున్నాడట. మరి రాజమౌళి గురి పెట్టాడు అంటే అది సాధించే వరకు వదిలిపెట్టడు ఆర్.ఆర్.ఆర్ తో ఆస్కార్ కల నెరవేరుతుందా లేదా అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: