సినిమా టైటిల్ ట్రేండ్ మారింది. ఒక్కప్పడు టైటిల్ చూసి సినిమా కథ ఎలాంటిదో చేపే వారు. సినిమాలోని పాత్రల పేర్లు, పాటలోని పల్లవి ని టైటిల్ గాను, తరువాత ఇంగ్లీషు పేరులను, ఇప్పడు మళ్లి పాత సినిమా పేరు లను టైటిల్ గా పెట్టుతున్నారు.  పాత టైటిల్ వల్ల సినిమా హిట్ అనే సెంటిమెంట్ పాత పేరులు పెట్టిన సినిమాలు హిట్ అవ్వడంతో వచ్చింది. హాస్య నటుడు సునీల్ నటించిన అందాల రాముడు, మర్యాద రామన్న, పూల రంగడు, అల్లరి నరేష్ నటించిన ఆహనా పెళ్లంటా చిత్రాలు హిట్ అవ్వడంతో పాత టైటిల్స్ కు డిమాండ్ పెరిగింది. క్రేజ్ ఏర్పడింది.  సినిమాలకు టైటిల్ ద్వారా ప్రేక్షకులను అకర్షించి, వైరెటీగా పేట్టడంలో దిట్ట పూరి జగన్నాథ్. అలాంటి జగనే దేవుడు చేసిన మనుషులు పేరుతో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ రాజా రవితేజ, ఇలీయానా జంటగా నటిస్తున్నా, టైటిల్ బట్టి ఈ చిత్రం పై ఎన్నో ఎక్స్ పేటేషన్స్ ఏర్పడాయి.  గతంలో ఎన్ టి రామారావు, కృష్ణ కలసి నటించిన చిత్రం దేవుడు చేసిన మనషులు, సూపర్,డుపర్ హిట్ తో , ఎడాది పాటు ఒకే దియెటర్ లో ఆడిన చిత్రంగా రికార్డ్ నమోదు అయ్యింది. అలాంటి చిత్రం పేరుతో జగన్నాద్ సినిమా నిర్మించి సహసం చేస్తున్నారు.  మరి పూరి, రవితేజ ల దేవుడు చేసిన మనుషులు చిత్రం కూడా గత చరిత్రలను మళ్లి సృష్టిస్తూందా?. 

మరింత సమాచారం తెలుసుకోండి: