బోయపాటి శ్రీనివాసు..బాలకృష్ణ సినిమాలతో తెలుగు నాట పేరున్న దర్శకుడిగా మారారు.  ఈ దర్శకుడి మీద ఇండస్ట్రీలో ఉన్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు
నమ్మి చేరదీస్తే - తిన్నింటి వాసాలు లెక్కబెట్టాడని బాహాటంగానే చెప్పారు పోసాని కృష్ణ మురళి.  అలాగే వేధిక మీదే బోయపాటి మీద పబ్లిక్ గానే రుస రుసలాడారు దేవీ శ్రీ ప్రసాద్.  చెప్పకుంటూ పోతీ మరెన్నో?


బోయపాటికి ప్రేక్షకులు పెట్టుకున్న ముద్దు పేరు అర్థ-దర్శకుడు, తన సినిమాలు మొదటి భాగాన్ని అబ్బా - భలే వుందంటే తీసి ద్వితీయ భాగంలో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే బోయపాటి దర్శకత్వానికి ప్రేక్షకులు ఇచ్చిన బిరుదిది.  


బోయపాటి శ్రీనివాసు తేదేపా 2019 ప్రచార వాణిజ్య ప్రకటనలు రూపొందించారన్నది అందరికీ తెలిసింన విషయంమే.   రిచ్ విజువల్స్, ప్రొఫెషనల్ సిబ్బందితో చాలా ఖర్చు పెట్టి తీసినట్లుగా అచ్చు సినిమా సీన్లు మాదిరా తీశారు యాడ్స్.


మొదట కొన్నిప్రకటనలను విడుదల చేశారు., తరువాత కొన్ని తరువాత కొన్ని అలా విడుదల చుస్తున్నారీ ప్రకటలను.  మొదట వచ్చిన ప్రకటనలు పరవాలేదనిపించినా తరువాత - తరువాత వచ్చే ప్రకటనలు ఎబ్బెటుగా - అతిగా ఉన్నాయనడంతో బోయపాటి అర్థ-దర్శకత్వం తమ పార్టీ ప్లాప్ కు కారణమవదుగా అనుకుంటున్నారు తేదేపా అభిమానులు..చూడాలి మరి!


మరింత సమాచారం తెలుసుకోండి: