తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు మొన్నటి వరకు తన  సినీ ప్రపంచంలోనే ఉన్నారు.  ఓ వైపు నటుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే..విద్యావేత్తగా కొనసాగుతున్నారు.  ఈ మద్య తాము కొనసాగిస్తున్న శ్రీ విద్యానికేతన్ కి సంబంధించి ఫీజ్ రియాంబర్స్ మెంట్ విషయంలో ఏపీ సర్కార్ పై విరుచుకు పడ్డారు..రోడ్డెక్కి తన నిరసన తెలిపారు. 

ఇదే ఊపులో ఆయన వైసీపీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.  తాజాగా మోహన్ బాబు కి హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు షాకిచ్చిన సంగతి తెలిసిందే. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్షను విధించింది.  దాంతో ఈ న్యూస్ కాస్త వైరల్ అయ్యింది.   ఆయన చెక్ బౌన్ కి సంబంధించి..రూ. 41.75 లక్షలను చెల్లించాలంటూ ఆదేశించింది. 

ఈ మొత్తాన్ని చెల్లించకపోతే జైలు శిక్షను మరో మూడు నెలలు పొడిగిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో, మోహన్ బాబు తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ ను కోర్టులో దాఖలు చేశారు.  ఈ మొత్తాన్ని తాను 30 రోజులలో చెల్లిస్తానని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  మరోవైపు  ఈ న్యూస్ పై మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'కొన్ని టీవీ చానళ్లు నాపై చేస్తున్న తప్పుడు ప్రచారం గురించి ఇప్పుడే విన్నా. నేను నా ఇంట్లోనే ఉన్నా' అంటూ ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: