సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల తరచూ వ్యసనాల బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతా అలా చేస్తారని కాదు కానీ.. సామాన్యులతో పోలిస్తే వారికి చెడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ విషయంలో హీరోయిన్లు ఏమీ మినహాయింపు కాదు.. 


మహానటి సావిత్రి వంటి వారే తాగుడుకు బానిసై జీవితాన్ని పాడు చేసుకున్నారు. అలాంటి వ్యసనాల్లో ఒకటైన తాగుడుపై నటి హేమ సంచలన కామెంట్లు చేశారు. 

ఆమె ఏమన్నారంటే.. చిత్రపరిశ్రమలో సీనియర్ ఆర్టిస్టుల్లో కొంతమంది తాగేసి ఆరోగ్యం .. జీవితం పాడుచేసుకున్న వాళ్లు వున్నారు. వాళ్లను చూసి జీవితంలో ఎక్కడా ఎప్పుడూ డ్రింక్ చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ దానికి నేను దూరంగానే వుంటూ వస్తున్నాను. 

నేను తాగుడుకి దూరం అన్న  విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఇక ఇప్పటికీ నేను గ్లామరస్ గా కనిపించడానికి కారణం సమయానికి ఆహారం .. నిద్ర ఉండేలా చూసుకోవడమే . చిత్రపరిశ్రమ ఇలా ఉంటుందనీ .. అలా ఉంటుందని ఆరంభంలో కొంతమంది నన్ను భయపెట్టారు. దాంతో జాగ్రత్తగా ఉండాలనే నిర్ణయం తీసుకునే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాను.



మరింత సమాచారం తెలుసుకోండి: