ఎన్టీఆర్ బయోపిక్ తో ఘోర అవమానాన్ని కొని తెచ్చుకున్న బాలకృష్ణ పోటీ చేసిన  హిందూపురం స్థానంలో కూడ ఎదురీత ఎన్నికలలో కొనసాగింది అన్న విషయం ఓపెన్ సీక్రెట్. అయితే ఆ ప్రాంతంలో ఎన్టీ రామారావుకు ఉన్న గౌరవం రీత్యా కనీసం అతి తక్కువ మెజారిటీతో అయినా తాను ఈ ఎన్నికల గండం నుండి బయటపడతాను అంటూ బాలయ్య  తన సన్నిహితుల వద్ద చెపుతున్నట్లు సమాచారం. 

అయితే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అని ఏర్పడ్డ అయోమయం రీత్యా ఎన్నికల ఫలితాలు రాకుండానే బాలకృష్ణ వ్యూహాత్మక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తెలుస్తున్న సమాచారం మేరకు మొన్న శ్రీరామనవమి రోజున బాలయ్య బోయపాటిని తన ఇంటికి పిలిపించి బోయపాటితో చేయబోయే మూవీ ప్రాజెక్ట్ ను తన పుట్టినరోజు అయిన జూన్ 10 నుండి ప్రారంభిద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. 

అయితే ఈమూవీ బడ్జెట్ ను ఏమాత్రం పెంచవద్దని 50 కోట్ల లోపే ఈమూవీని పూర్తి చేయమని బాలయ్య బోయపాటికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈసినిమాకు తానే నిర్మాతగా వ్యవహరిస్తానని బయట నిర్మాణ సంస్థల ప్రమేయం ఉండదు అని బాలయ్య క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

‘వినయ విధేయ రామ’ ఫ్లాప్ తో దిగాలుపడిపోయిన బోయపాటికి బాలయ్య పిలుపు మంచి జోష్ ను ఇస్తుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. పరాజయంతో రగిలిపోతున్న బాలయ్యకు అదేవిధమైన పరాజయంతో అనేక సెటైర్లు వేయించుకున్న బోయపాటికి కూడ ఈమూవీ ప్రాజెక్ట్ అత్యంత కీలకం. ఎన్నికల ఫలితాలు వచ్చిన కేవలం రెండు వారాల లోపే బాలకృష్ణ తన కొత్త సినిమా మొదలు పెట్టడం బట్టి ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా తన టాప్ హీరో స్థానాన్ని కాపాడుకోవడానికి ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: