కన్ను కంటే కిలాడి ఎవరుంటారు. అందం కనిపిస్తే చాలు అతుక్కుపోతుంది. నఖ శిఖ పర్యంతం చూపులతో తడిమేస్తుంది. రాపిడితో రఫ్ఫాడించేస్తుంది. బ్యూటీని చూస్తే దూకుడు పెంచేస్తుంది. ఒక్క చూపుతోనే చంపేస్తుంది. ఆ  చూపుల తూపులను తట్టుకోవడం కష్టమే మరి.


మరి వేల వేల కళ్ళున్న కెమెరావే కన్ను కొడితే. ఆ కిక్కు ఎలా ఉంటుంది. హాట్ హీరోయిన్లకు తెలిసినంతంగా మరెవరికీ తెలియదుగా. టాలీవుడ్ కెమరాకు అదే పని. అందగత్తె వంపుసొంపులను ఎంత కొలిచినా అలుపూ సొలుపూ ఉండదు. ఇంకా కొత్తందాలు కావాలంటుంది. కాక రేపుతూనే ఉంటుంది. నిజానికి టాలీవుడ్లోకి ఎంతో మంది బ్యూటీస్ వస్తూనే  ఉన్నారు. వారిలో కొందరే సక్సెస్ అవుతున్నారు. ఇలాగ వచ్చి అలాగ వెళ్లిపోయే వారితో పాటు సత్తా  చూపించే వారూ ఉన్నారు.


ఒక్క సినిమాతో వారి జాతకం ఏంటో తెలిసిపోతుంది. ఇక లేటెస్ట్ గా చెప్పుకోవాలంటే   ఇపుడు టాలీవుడ్లో నలుగుతున కొత్త అందం శ్రధ్ధ శ్రీనాధ్. నాని హీరోగా వస్తున్న జెర్సీ మూవీలో జోడీ కట్టిన శ్రధ్హ ఆ మూవీ ఆడియోలో మెరిసి మురిసింది. అందరినీ ఇట్టే ఆకట్టుకుంది. నిజానికి నానిది లక్కీ హ్యాండ్ అంటారు. ఎంతో మంది నానితో నటించి పెద్ద స్టార్స్ అయ్యారు.
అందానికి అందం, నటన కూడా వుందని చెబుతున్న శ్రద్ధ తీరు చూస్తూంటే టాప్ స్టార్ అయ్యేలా ఉందని అంటున్నారు. అపుడే ఈ అమ్మడి మీద అందరి కళ్ళు పడ్డాయని కూడా చెబుతున్నారు. తొందరలో ఓ టాప్ స్టార్ తో శ్రద్ధ జోడీ కట్టబోతోందని కూడా తెలుస్తోంది. చూడాలి మరి ఆమె లక్కు. లెక్క ఎలా ఉన్నాయో.


మరింత సమాచారం తెలుసుకోండి: