ఆమె నటన అద్భుతం. చిన్న వయసులోనే సెల్యూలాయిడ్ మీద విరబోసిన ఆ అందం దశాబ్దన్నర కాలం పాటు తనదైన శైలిలో విరబూసింది. నటన ప్లస్ అందానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఆమె ఉంటే చాలు సినిమా హిట్ అన్న స్థాయికి ఎదిగింది. వెటరన్ హీరోయిన్లను గుర్తుకు తెచ్చేలా తన నటనా కౌశలాన్ని చాటింది.


ఆమె నటీ శిరోమణి సౌందర్య. ఆమె మనకు దూరమైన సరిగ్గా ఈ రోజుకు 15 సంవత్సరాలు. సౌందర్యం నేలకు రాలిన చీకటి రోజు అది. 2004 ఏప్రిల్ 17న కరీంనగర్ లో  అప్పటి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీహెచ్ విద్యాసాగరరావుకు ప్రచారం చేయడం కోసం బెంగుళూరు నుంచి హెలికాప్టర్లో బయల్దేరిన సౌందర్య అది టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే మండిన మంటల్లో కాలి బూడిదైపోయింది. ఆమెతో పాటు సోదరుడు కూడా ఆ ప్రమాదంలో చనిపోయారు. అందరూ చూస్తుండగానే నిప్పులు చిమ్ముతూ నేలకు తాకిన హెలికాప్టర్ సౌందర్యాన్ని పొట్టన పెట్టుకుంది


రక్షించండి అన్న సౌందర్య మాటలు అక్కడ జనం చెవుల్లో ఇప్పటికీ ఉన్నాయి. ఉదయం పది పదకొండు గంటల ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటన క్షణాల్లో అంతటా వ్యాపించింది. వెండి తెర సౌందర్యం ఇక లేదు అన్న వార్తను టాలీవుడ్ తట్టుకోలేక విల‌పించింది. తెలుగులో అగ్ర హీరోల పక్కన నటించిన సౌందర్య లేడీ ఓరిఎంటెడ్ మూవీస్ లోనూ  నటించి తన సత్తా చాటారు. ఆమె ఇపుడు ఉండి ఉంటే బాగుణ్ణు అని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. అలాంటి అందం, నటన ఆమె సొంత. తిరిగి రాని లోకాలకు ఆమె వెళ్ళినా ఆమె నటించిన చిత్రాలు మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయి. అందులో ఆమె మనల్ని పలకరిస్తూనే ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: