టాలీవుడ్‌లో అమ్మాయిలపై వేధింపులు, పడుకుంటేనే అవకాశాలిస్తామంటూ సతాయిస్తున్న సినీపరిశ్రమ వ్యక్తుల గురించి నటి శ్రీరెడ్డి కొంతకాలం క్రితం చేసిన పోరాటం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆమె ఏకంగా టాప్ లెస్‌ గా ధర్నా చేసేందుకు కూడా ప్రయత్నించారు. మొత్తానికి ఇప్పుడు శ్రీరెడ్డి కోరిక నెరవేరబోతోంది. 


టాలీవుడ్‌లో లైంగిక వేధింపులపై శ్రీరెడ్డి ఆరోపణలపై ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. టాలీవుడ్ లో లైంగిక వేధింపలపై ఫిర్యాదులు స్వీకరించేందుతు ఓ  ప్యానల్ ఏర్పాటుకు తెలంగాణ అంగీకరించింది. ప్యానల్ ఏర్పాటు చేస్తూ జీవో 984 ను విడుదల చేసింది.

సినీ పరిశ్రమకు సంబంధించిన మహిళలు తమను ఎవరైనా వేధిస్తే ఈ కమిటీ ముందు ఇక నిర్భయంగా చెప్పవచ్చు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్యానల్ లో నటి సుప్రియ, నటి, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డి ఉన్నారు. 

వీరితో పాటు నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయ లక్ష్మి కూడా ప్యానల్‌ లో ఉన్నారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్ మోహన్ రావు, నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, సుధాకర్ రెడ్డి కూడా ఈ ప్యానల్‌లో  సభ్యులు. రాంమోహన్ రావు ఈ కమిటీకి చైర్మన్‌.  మొత్తానికి శ్రీరెడ్డి పోరాటం ఫలించినట్టే. 



మరింత సమాచారం తెలుసుకోండి: