ఒక టాలీవుడ్ హీరోకి నేషనల్ స్టార్ ఇమేజ్ ఏర్పడటం చాలకష్టం. అయితే ‘బాహుబలి’ తో నేషనల్ స్టార్ గా మారిపోయాడు ప్రభాస్. అతడి క్రేజ్ ప్రస్తుతం పీక్ కు చేరిపోవడంతో ప్రభాస్ కు సంబంధించిన ఒక ఫోటో లేదా ఒక న్యూస్ వచ్చింది అంటేచాలు అది క్షణాలలో వైరల్ అవుతోంది. 

సోషల్ మీడియాను ఏమాత్రం పట్టించుకోని ప్రభాస్ ఈమధ్యనే ఇన్ స్టా గ్రామ్ లో తన అకౌంట్ ను ఓపెన్ చేసాడు. కనీసం ఫోటో అదేవిధంగా మొదటి పోస్ట్ కూడ లేని ఈ అకౌంట్ కు 7 లక్షల మంది ఫాలోయర్స్ ఏర్పడటం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. ఈవిషయాలు అన్నీ ప్రభాస్ దృష్టికి రావడంతో ప్రభాస్ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో మొదటి ఫోటోను షేర్ చేసాడు. 

'బాహుబలి 2' సినిమా నుండి అమరేంద్ర బాహుబలి గెటప్ లో ఉన్న ఒక స్టిల్ పోస్ట్ చేశాడు.  లాంగ్ హెయిర్ తో రెండు కత్తులను చేతబట్టిన పవర్ఫుల్ లుక్ కు సంబంధించిన ఫోటో అది. ఈ ఫోటోను ఇప్పటికే అభిమానులు అనేక సార్లు చూసినా ప్రభాస్ షేర్ చేసిన మొదటి ఫోటో కావడంతో ‘వెల్కం అన్నా, వెల్కమ్ డార్లింగ్’ అంటూ వేల సంఖ్యలో మెసేజులు పెట్టడమే కాకుండా ప్రభాస్ షేర్ చేసిన ఆ ఫోటోకు అభిమానుల నుండి గంటలోపే 82 వేల లైక్స్ రావడం ప్రభాస్ మ్యానియాను సూచిస్తోంది. 

సోషల్ మీడియాకు దూరంగా ఉండే ప్రభాస్ ఇన్ స్టా గ్రామ్ లోకి వచ్చినందుకు ఆనందపడుతూ అందరికీ తెలిసిన ‘బాహుబలి’ ఫోటో కాకుండా ప్రభాస్ చిన్న తనానికి సంబంధించిన ఫోటో కాని లేదంటే ‘సాహో’ కు సంబంధించి ఇప్పటి వరకు విడుదల కాని ఫోటో కాని పెడితే బాగుండేది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా అంటేనే కామెంట్స్ వస్తాయి కాబట్టి ఆ కామెంట్స్ కు దూరంగా ఉండాలి అన్న ఉద్దేశంతో సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ప్రభాస్ తప్పనిసరి పరిస్థితులలో బాలీవుడ్ లో తన ఇమేజ్ పెరగడం కోసం ఇన్ స్టా గ్రామ్ ద్వారా ప్రయత్నిస్తే ప్రభాస్ తొలి అడుగులోనే విమర్శలు రావడం షాకింగ్ మారింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: