అత్యంత భారీ అంచనాల మధ్య నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘జెర్సీ’ ఓవర్సీస్ టాక్ బయటకు వస్తోంది. ఈమూవీలో నాని నటనకు సంబంధించిన విశ్వరూపం కనిపిస్తుంది అని ప్రశంసలు కురిపిస్తున్న ఓవర్సీస్ ప్రేక్షకులు ఈమూవీ సెకండ్ ఆఫ్ లాగినట్లు అనిపిస్తుందని అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈమూవీ క్లైమాక్స్ తో ప్రేక్షకులు కనెక్ట్ అయి తీరుతారు అంటూ క్లైమాక్స్ చాల బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ముఖ్యంగా ఈసినిమాలో మనసుకు హత్తుకునిపోయే సన్నివేశాలు చాల ఉన్నాయని ఈమూవీని ఇప్పటికే చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. అంతేకాదు ఈసినిమాకు అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈమూవీ మరో స్థాయికి చేరుకుంటుందని ఓవర్సీస్ ప్రేక్షకుల అభిప్రాయం. ముఖ్యంగా ఈమూవీ ఫస్ట్ ఆఫ్ చాల ఎమోషనల్ గా ఉండి అర్జున్ పాత్రలో నాని నటన అందరికీ కనెక్ట్ అవుతుందని ఈమూవీలోని సీన్స్ అన్నీ రియలిస్టిక్ గా ఉన్నాయని ఓవర్సీస్ ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈసినిమాలోని నాని నటనతో సమానంగా ఈమూవీ స్క్రీన్ ప్లేన్ ను అద్భుతంగా దర్శకుడు గౌతమ్ నడిపించాడనీ ఓవర్సీస్ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫీల్ గుడ్ మూవీగా ఈమూవీ క్లాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని అని అంటున్నారు.  అయితే ఈసినిమా ఫస్ట్ ఆఫ్ చాలబాగున్నా సెకండ్ ఆఫ్ వచ్చేసరికి స్లో అవ్వడంతో సగటు ప్రేక్షకుడు కొంత అసహనానికి గురి అవుతాడని ఈ అసహనాన్ని అధికమించి ఈమూవీ సగటు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే పరిస్థుతుల బట్టి మాత్రమే ఈమూవీ ఏమేరకు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అన్న విషయం ఆధారపడి ఉంటుందనీ అంటున్నారు. 

మరి కొందరైతే ఈమూవీ అందరికీ నచ్చినా రిపీట్ ఆడియన్స్ ఈమూవీకి రావడం కష్టం అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనితో ఓవర్సీస్ టాక్ విషయంలో మంచి మార్కులు వేయించుకున్న ‘జెర్సీ’ సగటు ప్రేక్షకుల నుండి ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుంది అన్న విషయం తెలియాలి అంటే మరి కొన్ని గంటలు ఆగాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: