ప్రముఖ సినీ నటి సుధ గురించి తెలుగు సినిమా ప్రేక్షకుల్లో తెలియని వారు ఉండరు. 500లకు పైగా సినిమాల్లో నటించింది. గతంలో హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో హీరోకు సోదరి, వదినగా నటించిన సుధ యువ హీరోలకు తల్లిగా కూడా నటిస్తున్నారు. తెలుగులో మహేష్‌ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, తమిళంలో సూర్య, విశాల్‌ లాంటి స్టార్‌ హీరోల సినిమాల్లో సైతం సుధ త‌ల్లిగా కేర్‌క్ట‌ర్‌ ఆర్టిస్ట్‌గా నిటించారు. సుధ పుట్టింది తమిళ‌నాడు రాష్ట్రంలోని శ్రీరంగం. స్వతహాగా ఆమె తమిళియన్‌ అయినా తెలుగు సినిమా పరిశ్రమతోనే ఆమెకు అనుబంధం ఎక్కువ. పద్మశ్రీ దివంగత అల్లూరి రామలింగయ్య సలహాతో తెలుగు సొంతంగా నేర్చుకున్న సుధ తెలుగులో ఆమె పాత్రకు ఓన్‌గా డబ్బింగ్‌ చెప్పుకుంటారు. 

Image result for tollywood artist sudha

సుధ కుమార్తె ఎంబీఏ పూర్తి చేశారు. దిగ్గ‌జ‌ దర్శకుడు కమలాకర్ కామేశ్వరరావు రూపొందించిన వినాయక విజయం సినిమాతో బాల‌నటిగా ఆమె వెండితెరకు పరిచయం అయ్యారు. సుధ తొలి సినిమాకు కే. బాలచందర్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలిపి 700 వందల సినిమాల్లో నటించిన సుధకు తెలుగులో తల్లిదండ్రులు తొలి సినిమా. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో అమ్మ, అత్తయ్య, అక్క, వదిన పాత్రలంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు సుధ. తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర హీరో నాగార్జునకు తాను ఎప్పటికి రుణపడి ఉంటానని సుధ చెబుతుంటారు. ఆయ‌న హీరోగా ఏ.కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ప్రెసిడెంట్‌ గారి పెళ్లాం షూటింగ్‌ టైమ్‌లో తీవ్రమైన కడుపు నొప్పితో కుప్పకూలి పడిపోతే స్పాట్‌లో ఉన్న నాగార్జున వెంటనే త‌న వెహికల్లో తీసుకువెళ్లి అపోలో హాస్పటల్లో జాయన్‌ చేశారట. 

Image result for tollywood artist sudha

ప‌రిస్థితి సీరియ‌స్‌గా ఉండ‌డంతో అప్పటికప్పుడు ఆపరేషన్‌ చెయ్యడంలో తాను బతికి బయటపడ్డానని సుధ నాగార్జునపై తన కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఇప్పుడు తాను ఇలా ఉన్నానంటే అందుకు నాగార్జునే కార‌ణ‌మ‌ని ఆమె ఎప్పుడూ చెపుతుంటారు. ఇండస్ట్రీలో తాను మరచిపోలేని వ్యక్తుల్లో కే. బాలచందర్‌ ఒకరైతే ఉదయ్‌ కిరణ్‌ కూడా మరో వ్యక్తి అని చెప్పి సుధ చెప్పారు. ఉదయ్‌ కిరణ్‌ తన సొంత కొడుకుతో సమానమని, ఉదయ్‌ కిరణ్‌ను తాను దత్తత తీసుకోవలని కూడా అనుకున్నానని ఈ లోగా అతడు చనిపోవడం బాధాకరమని సుధ అవేధన వ్యక్తం చేశారు. ఉదయ్‌ కిరణ్‌ నటించిన 9 సినిమాల్లో తాను అతడికి అమ్మ పాత్రలో నటించానని సుధ చెప్పారు. అందువల్ల తమ ఇద్దరి మధ్య తల్లి కొడుకుల అనుబంధం ఏర్పడిందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: