‘రంగస్థలం’ లాంటి బ్లాకు బస్టర్ ఇచ్చిన సుకుమార్ ప్రస్తుతం పడుతున్న కష్టాలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిపోయాయి. సుమారు ఒక ఏడాది పాటు మహేష్ కాంపౌండ్ చుట్టూ రకరకాల కధలతో ప్రదక్షిణం చేసిన సుకుమార్ కు మహేష్ దగ్గర ఎదురైనా పరాభవం ఇప్పటికి సుకుమార్ బయటకు చెప్పుకోలేని విధంగా మారింది. దీనితో అసహనానికి లోనైన సుకుమార్ అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లి తనతో ఒక సినిమాను చేయడానికి ఒప్పించుకున్నా ఫలితం లేకుండా పోయింది అన్న వార్తలు వస్తున్నాయి. 

హడావుడిగా  ప్రకటింప బడ్డ అల్లు అర్జున్ సుకుమార్ ప్రాజెక్ట్ కు ఇప్పటికి సరైన స్క్రిప్ట్ కుదరలేదు   అన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి.  ఇలాంటి పరిస్థుతుల నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు దర్శకుడు వేణు శ్రీరామ్ తో వచ్చి చూపించిన  బౌండ్ స్క్రిప్ట్ అల్లు అర్జున్ కు పూర్తి గా నచ్చడంతో ఈమూవీ సుకుమార్ మూవీ కన్నా ముందుగా ప్రారంభం అయ్యే అవకాశాలు స్పష్టంగా కానీ పిస్తున్నాయి. దిల్ రాజ్ త్వరలో మహేష్ అనిల్ రవిపూడి కాంబినేషన్ లో ప్రారంభిస్తున్న మూవీని జూన్ లో మొదలు పెట్టి నవంబర్ కు పూర్తి చేయబోతున్న పరిస్థితులలో డిసెంబర్ నుండి అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ ల మూవీ పట్టాలు ఎక్కడం ఖాయం అన్న సంకేతాలు వస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థితులలో ఈ మధ్య బన్నీ సుకుమార్ ను పిలిచి తన కథను ఎట్టి పరిస్థితులలో రాబోతున్నా మూడు నెలలలోగా పూర్తి చేయమని లేకుంటే వచ్చేఏడాది జూన్ వరకు తన డేట్స్ దొరకవు అని స్పష్టంగా చెప్పిన్నట్లు టాక్. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి గత నాలుగు అయిదు నెలలుగా దర్శకుడు త్రివిక్రమ్ ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ మాత్రమే తయారుచేసి ఇప్పటికి సెకండాఫ్ లేకుండానే షూటింగ్ మొదలు అయింది అన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో అలాంటి మినహాయింపు పెద్ద మనసుతో అల్లు అర్జున్ సుకుమార్ కు ఇస్తాడ ? ఇవ్వడా అన్న విషయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

దీనితో క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కు ఇలాంటి పరిస్థితి రావడానికి గల కారణం ‘రంగస్థలం’ లాంటి మరో మూవీ కథను టాప్ హీరోలు అందరూ అడుగుతున్న నేపధ్యంలో బయటకు చెప్పుకోలేని కన్ఫ్యూజన్ లో సుకుమార్ ఉన్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: