తెలుగు ఇండస్ట్రీలో చిన్న కమెడియన్ గా తన ప్రస్థానం మొదలు పెట్టిన బండ్ల గణేష్ అనూహ్యంగా స్టార్ ప్రోడ్యూసర్ రేంజ్ కి ఎదిగాడు.  అప్పట్లో ఆయన కొంత మందికి బినామీ అని రూమర్లు కూడా వచ్చాయి.  కానీ తన స్వయంకృషితో ఎదిగి నిర్మాత స్థాయికి వచ్చానని బండ్ల గణేష్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.  నిర్మాతగా మారిన తర్వాత నటుడిగా ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. 

గత కొంత కాలంగా ఆయన నిర్మాతగా వ్యవరించిన చిత్రాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.  ఇటీవల తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి నానా హంగామా సృష్టించారు.  ఒకదశలో తెలంగాణలో కాంగ్రెస్ నెగ్గకుంటే బ్లేడు తో తన గొంతు కోసుకుంటానని చెప్పారు.  మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ఓటమి పాలు కాగా...అత్యంత మెజార్టీతో టీఆర్ఎస్ నెగ్గి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

దాంతో బండ్ల మీడియా కంటికి చిక్కలేదు. ఇటీవల ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ట్విట్టర్ సాక్షిగా వెల్లడించారు. ఇప్పుడు బండ్ల మరోసారి వెండితెరపై కనిపించబోతున్నారట. సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయనున్న సినిమాలో బండ్ల గణేష్ ఒక ఎంటర్టైనింగ్ రోల్ చేస్తారని తెలుస్తోంది.  అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: