ఇటీవలే లక్షీస్ ఎన్టీఆర్ సినిమా ద్వారా సంచలనం సృష్టించిన వర్మ మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు. ఈసారి వర్మ కేసీఆర్ బయోపిక్ తీస్తానంటూ సందడి చేస్తున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్‌ లో ఎన్టీఆర్ పాత్రను రంగస్థల నటుడు ద్వారా చేయించి మెప్పుపొందాడు వర్మ.


ఇప్పుడు కేసీఆర్ పాత్ర ఎవరు పోషిస్తారు..? ఈ సినిమాలో విలన్ గా ఎవరిని చూపిస్తారు అన్న విషయాలు ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారాయి. కేసీఆర్ పాత్ర కోసం వర్మ ఇప్పటికే ఓ వ్యక్తిని ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. 

అతనెవరో తెలుసా.. జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా పాపులర్ అయిన మహేశ్.. ఈ కుర్రాడు సినిమాల్లోనూ మంచి వేషాలే దక్కించుకుంటున్నాడు. రంగస్థలం, మహానటి సినిమాల్లో క్యారెక్టర్స్ బాగానే పండాయి. ఇప్పుడు కేసీఆర్ పాత్ర కోసం ఇతడిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. 

మరి ఇతగాడు కేసీఆర్ పాత్రలో సూట్ అవుతాడా  లేదా అన్నది తేలాలి. మహేశ్ పూర్తి ఆంధ్రా యాసలో మాట్లాడతాడు.. అదే అతనికి ప్లస్ పాయింట్. మరి ఈ సినిమాలో కేసీఆర్ పాత్రకు తెలంగాణ యాస అతడికి నప్పుతుందా..లేదా.. అన్నది కూడా ఆసక్తికరమే.. చూడాలి ఏంజరుగుతుందో. 



మరింత సమాచారం తెలుసుకోండి: