‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలకు నిద్ర లేకుండా చేశారు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఎన్నికల నేపథ్యంలో సినిమాని కూడా ఆపేశారు ఏపీ లో ఉన్న టిడిపి నాయకులు. ఇదిలా ఉండగా తాజాగా రామ్ గోపాల్ వర్మ కేసీఆర్ బయోపిక్ తీయడానికి రెడీ అయినట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు.

Image result for kcr biopic rgv

తెలంగాణ ఉద్యమం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు ఈ సినిమాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నేతలు ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ని విలన్ గా చూపించబోతున్నట్లు ఫిలింనగర్ టాక్. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో రాంగోపాల్ వర్మ చంద్రబాబుని ఎందుకు పోటీదారుడిగా మరియు నందమూరి కుటుంబ సభ్యులను విలన్లుగా చూపించడం జరిగింది.

Image result for chandrababu  biopic rgv

ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ లో ఆర్జీవీ కచ్చితంగా సీమాంధ్ర రాజకీయ నేతలను విలన్లుగా చూపే అవకాశం ఉంది. అంతేకాకుండా వర్మ తన సినిమా గురించి ఇటీవల సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఏపీ ప్రజలు తెలంగాణ వారిని థర్డ్ క్లాస్ సిటిజన్స్ గా చూశారని పేర్కొన్నాడు. దాన్ని బట్టి.. సీమాంధ్ర పాలకులను ఈ సినిమాలో ఆర్జీవీ విలన్లుగా చూపే అవకాశాలున్నాయని అంటున్నారు సినిమా విశ్లేషకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: