టోటల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ‘జెర్సీ’ మూవీలోని హీరో పాత్ర పేరు అర్జున్ అయితే అతడి కొడుకు పాత్ర నాని కావడంతో ఆ పాత్రల పేర్లకు ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అవుతున్నారు. ఈసినిమాలో నానీ కొడుకుగా  నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ నటన అందరికీ విపరీతంగా నచ్చడంతో ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు అంటూ అప్పుడే పరిశోధనలు మొదలైపోయాయి.

ఈమూవీలో ఆర్ధికస్థోమత లేని తన నాన్నను ‘జెర్సీ’ కొనివ్వమని అడిగే పదేళ్ళ అబ్బాయిగా నటించిన రోనిత్ కమ్రా ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారాడు. ఢిల్లీలో ఉండే రోనిత్ చిన్నతనంలోనే  చైల్డ్  మోడల్ గా ఎదిగాడు. ఫ్యాబ్ ఇండియా డ్రెసెస్ తో పాటు ఇప్పటికే చాలా బ్రాండ్లను ఈ అబ్బాయి  ఎండార్స్ చేస్తున్నాడు. 

ఈ పిల్లవాడికి యాడ్స్ రంగంలో విపరీతమైన డిమాండ్ ఉందట. ఆ అనుభవంతోనే ‘జెర్సీ’ లో నాని కొడుకుపాత్రలో అద్భుతంగా నటించాడు అని ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈమూవీలోని బర్త్ డే సీన్ లో ‘నువ్వు కొట్టావంటే ఎవరు నమ్మరు నాన్న’ అని చెప్పే సీన్లో ఆ పిల్లవాడి నటనకు ప్రేకషకులు విపరీతంగా కనెక్ట్ అవుతున్నారు.   ఈమూవీలో ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పెద్ద అయ్యాక కనిపించే పాత్రలో నటించిన నటుడి పేరు హరీష్ కళ్యాణ్. 

ఇతడు తమిళనటుడు కేవలం ఇతడు నటించిన సీన్స్ రెండు మాత్రమే అయినా ఆ రెండు సీన్స్ లో ఈ నటుడు అద్భుతంగా నటించాడు. ఇతడి పాత్రకు నాని తన గొంతు మార్చి డబ్బింగ్ చెప్పాడు. ఈచిన్న పాత్రకు కూడ మంచి పేరు రావడంతో వీరిద్దరికీ భవిష్యత్ లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాల అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది. ‘జెర్సీ’ పాజిటివ్ టాక్ తో ప్రస్తుతం కలక్షన్స్ విషయంలో ఎదురులేక పోయినా రేపు సోమవారం ఈమూవీకి వచ్చే కలక్షన్స్ ను బట్టి ఈమూవీ ఏ రేంజ్ హిట్ అన్న విషయం క్లారిటీ వస్తుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: