తెలుగులో టాప్ కమెడియన్ బ్రహ్మానందం అన్న విషయంలో రెండో మాటే ఉండదు. కొన్ని సినిమాలు కేవలం ఆయన వల్లే ఆడాయి అనే రేంజ్‌కు ఆయన వెళ్లిపోయారు. బ్రహ్మానందం లేని సినిమా... ఉప్పులేని పప్పు అన్నంతగా పేరు తెచ్చేసుకున్నారు.


పేరు ప్రఖ్యాతులు ఉన్నా.. బ్రహ్మానందంపై అనేక వదంతులు కూడా ఉన్నాయి. ఆయన ఎవరినీ ఎదగనీయరని కొత్త కమెడియన్లను తొక్కేస్తారని అంటుంటారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది.. ఈ విషయంపై మరో కమెడియన్ సునీల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. 

సినీరంగంలో ఎవరూ ఎవరినీ తొక్కేయలేరంటున్న సునీల్.. మనల్ని మనమే తొక్కేసుకుని, మన చేతకానితనాన్ని మరొకరిపై వేసేస్తుంటామన్నారు. బ్రహ్మానందం సినిమాలు తీయలేదు. నటించారు. అలాంటప్పుడు ఆయన ఎలా తొక్కేస్తారని సునీల్  ప్రశ్నించారు.

బ్రహ్మానందం  ఈతరం కమెడియన్లను కూడా ఇంటికి పిలిపించుకుని, భోజనం పెట్టి మరీ పంపిస్తారని సునీల్ అంటున్నారు. తాను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సీనియర్లతో ఎలా బిహేవ్ చేయాలా అని మథనపడ్డానని..కానీ వాళ్లంతా తమలో ఒకడిగా తనను  కలిపేసుకున్నారు సునీల్. 



మరింత సమాచారం తెలుసుకోండి: