ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ క్రేజీ హీరోయిన్ గా రష్మిక హవా కొనసాగుతున్న నేపధ్యంలో ఈమెతో నటించడానికి టాప్ హీరోల దగ్గర నుండి యంగ్ హీరోల వరకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థుతులలో ఈమె ఒకేసారి ఇంచుమించు ఒకే డేట్స్ ను మహేష్ అఖిల్ ల మధ్య సద్దుబాటు చేయలేక సతమతమవుతున్నట్లు టాక్. 

మహేష్ తో అనీల్ రావిపూడి తీయబోతున్న మూవీలో రష్మిక హీరోయిన్ గా ఎంపిక అయింది. అదేవిధంగా గీత ఆర్ట్స్ అఖిల్ తో ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్ లో నిర్మిస్తున్న మూవీకి కూడ రష్మిక హీరోయిన్ గా ఎంపిక అయింది. వాస్తవానికి ఆమె అఖిల్ తో నటించే విషయంలో పూర్తిగా ఇష్టం చూపెట్టకపోయినా అల్లు అరవింద్ ఒత్తిడితో ఆమెఆసినిమాకు అంగీకరించినట్లు టాక్.

జూన్ లో మహేష్ అనీల్ రావిపూడిల సినిమా మొదలు అయితే అదే నెల చివరిలో అఖిల్ సినిమా మొదలు కాబోతోంది. ఈ రెండు సినిమాలను కూడ చాల వేగంగా పూర్తిచేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే రష్మిక ఒప్పుకున్న తమిళ కన్నడ సినిమాల షూటింగ్ నడుస్తున్న నేపధ్యంలో ఈమె ప్రస్తుతం ఒప్పుకున్న ఈరెండు సినిమాలతో పాటు నితిన్ తో ఇప్పటికే కమిట్ అయిన ‘భీష్మ’ మూవీ షూటింగ్ కూడ ప్రారంభం కాబోతోంది.

ఈ పరిస్థుతుల నేపధ్యంలో ఈమె డేట్స్ షెడ్యూల్ లో ఒక్కరోజు తేడా వచ్చినా ఈమె నటిస్తున్న అన్ని సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ మారిపోతాయి. రకుల్ రాశీ ఖన్నాలు గ్లామర్ గా కనిపిస్తూ ఇంకా మరింత ఎక్స్ పోజ్ చేయడానికి రెడీ అవుతున్నా క్రేజ్ అంతా రష్మిక వైపే కొనసాగుతోంది.  అల్లు అర్జున్ కూడ తనకు రష్మిక కావాలి అని అడుగుతున్నట్లు వార్తలు వస్తున్న పరిస్థుతులలో ఇంతమంది హీరోలకు రష్మిక డేట్స్ ఎలా దొరుకుతాయి అన్న అయోమయంలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: