నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా జెర్సీ. ముందునుండి నాని అంచనాలను పెంచగా లాస్ట్ ఫ్రైడే రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. ప్రేక్షకులే కాదు సెలబ్రిటీస్ కూడా జెర్సీ సినిమా చూసి వావ్ అనేస్తున్నారు. ముఖ్యంగా నాని నటనతో పాటుగా గౌతం తిన్ననూరి కథ, కథనం పై ఎక్కువ డిష్కషన్ జరుగుతుంది.


ఇక టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ జెర్సీ సినిమాను ఆకాశానికెత్తేశారు. నాని నటనకు, గౌతం డైరక్షన్ కు హ్యాట్సాఫ్ అనేశారు. అయితే తారక్, బన్ని ఇద్దరు గౌతం గురించి ఆరా తీస్తున్నారట. ఇద్దరు అతని ప్రతిభను మెచ్చుకుంటున్నారు. చూస్తుంటే మంచి కథ ఉంటే గౌతం డైరక్షన్ లో వారు సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


జెర్సీ సినిమా ముందు చూసిన తారక్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. గౌతం తిన్ననూరి డైరక్షన్ కూడా సూపర్ అనేట్టుగా కామెంట్ పెట్టాడు. బన్ని కూడా నాని కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెబుతూ డైరక్టర్ గౌతం ను బాగా మెచ్చుకున్నాడు. మరి ఈ ఇద్దరిలో ఎవరు గౌతం తిన్ననూరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి.


ఇక జెర్సీ సినిమా సక్సెస్ ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదని అంటున్నాడు డైరక్టర్ గౌతం. మళ్లీ రావా కన్నా ముందే ఈ కథ రాసుకున్నానని.. డబ్బింగ్ చెప్పేప్పుడు తాను కూడా సర్ ప్రైజ్ అయ్యి తానేనా ఈ సినిమా తీసిందన్న భావన వచ్చిందని అన్నాడు. మొత్తానికి తెలుగు పరిశ్రమలో మరో టాలెంట్ ఉన్న డైరక్టర్ వచ్చాడు. మళ్లీరావాతో మనసులు గెలిచిన గౌతం తిన్ననూరి జెర్సీతో హృదయాల్లో మిగిలిపోయే సినిమా అందించాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: