ఈ ఏడాది సమ్మర్ కానుకగా న్యాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమా విడుదలయ్యి మంచి హిట్ కొట్టింది. గత ఏడాది మొత్తం నాని నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడడంతో తాజాగా నాని క్రికెటర్ గా నటించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో దోచుకొని చాలా మంది ప్రముఖుల ప్రశంసలను అందుకొంది.

Image result for jersey nani ntr

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా చూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నానికి కంగ్రాట్స్ చెబుతూ సినిమా యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో ఏమైందో ఏమోగానీ ఒక్కసారిగా నందమూరి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ పై సీరియస్ అయినట్లు ఫిలింనగర్ టాక్. విషయం ఏమిటంటే నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్ర కథ ఆధారంగా నందమూరి బాలకృష్ణ నటించిన రెండు సినిమాలు విడుదలయినప్పుడు సోషల్ మీడియాలో కనీస స్పందన ఇవన్నీ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా జెర్సీ సినిమాపై స్పందించడంతో తట్టుకోలేకపోతున్నారు.

Image result for jersey nani ntr

తన తాత పేరు ఎప్పుడు ప్రస్తావన తీసుకు వచ్చే ఎన్టీఆర్ తన తాత సినిమా రిలీజ్ అయినప్పుడు స్పందించకుండా నాని సినిమాకు కంగ్రాట్స్ అని మెసేజ్ సోషల్ మీడియాలో పెట్టేసరికి వీరు కాస్త ఎన్టీఆర్ పై మండిపడుతున్నారని తెలుస్తుంది. మరో పక్క ఎన్టీఆర్ పై వచ్చిన 2 సినిమాలు ప్రేక్షకులను కాస్త నిరాశ పరచడంతో ఎన్టీఆర్ స్పందించలేక ఉండి ఉంటారని మరి కొంతమంది అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: