నాచురల్ స్టార్ నాని జెర్సీ సినిమాతో మరోసారి తన నటనా ప్రతిభ చాటుకున్నాడు. అష్టాచమ్మ నుండి జెర్సీ వరకు నాని తన సహజ నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు. ఇక జెర్సీలో అర్జున్ పాత్రలో మాత్రం అతని కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా ముందు వరకు కెరియర్ కాస్త అటు ఇటుగా ఉన్న నాని ఆ తర్వాత నుండి దశ తిరిగింది.


భలే భలే మగాడివోయ్ సినిమాతో నాచురల్ స్టార్ గా అవతరించాడు నాని. అక్కడ నుండి ఆరు సినిమాలు హిట్టు కొట్టిన నాని లాస్ట్ ఇయర్ కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాలతో నిరాశపరచాడు. అయితే జెర్సీ మీద ముందునుండి పూర్తి నమ్మకంతో ఉన్న నాని తను అనుకున్న రేంజ్ కన్నా ఎక్కువ హిట్టే కొట్టాడు.


ముఖ్యంగా అర్జున్ పాత్రలో నాని సహజమైన నటన అందరిని అలరిస్తుంది. జెర్సీలో కథ, కథనాలు ఒక లెక్క అయితే వాటిని పోశించిన పాత్రధారులు ప్రాణం పోశారు. నాని నటనలో మరోసారి తన సత్తా చాటాడు. నాచురల్ స్టార్ గా నాని జెర్సీ సినిమాలో కొన్ని సీన్స్ అయితే ఎలాంటి నటుడైనా ఈర్ష పడేలా ఉంటుంది.


జెర్సీ సినిమాతో నాని మరో మెట్టు ఎక్కాడని చెప్పొచ్చు. అర్జున్ పాత్రలో నాని నటనకు అందరు ఇది కదా నాచురల్ స్టార్ అంటే అనేలా చేసుకున్నాడు. జెర్సీ సినిమాలో నాని సరసన నటించిన శ్రద్ధా శ్రీనాథ్ కూడా బాగా చేసింది. సినిమా ఇంత బాగా రాడానికి దర్శకుడు ప్రతిభ మెచ్చుకోదగినది.



మరింత సమాచారం తెలుసుకోండి: