నాచురల్ స్టార్ నాని.. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇద్దరు ఇద్దరే.. అయితే ఎన్.టి.ఆర్ రెండు సినిమాలతోనే స్టార్ రేంజ్ కు వెళ్లాడు. నాని మాత్రం ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని నాచురల్ స్టార్ గా ఎదిగాడు. ఈమధ్య నాని సినిమాల బాక్సాఫీస్ సందడి బాగానే ఉంది.


ఇదిలాఉంటే ఇప్పుడు నాని ఎన్.టి.ఆర్ కు ఈక్వల్ అయ్యాడని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్, నాని ఎలా ఈక్వల్ అవుతారు అని అనుకోవచ్చు. యూఎస్ బాక్సాఫీస్ పై 1 మిలియన్ డాలర్స్ సంపాదించిన ఎన్.టి.ఆర్ సినిమాలు ఆరు కాగా ఇప్పుడు నాని జెర్సీ సినిమాతో 1 మిలియన్ క్లబ్ లో చేరి ఎన్.టి.ఆర్ ను సమం చేశాడు.


ఈగ సినిమాతో నాని మిలియన్ మార్క్ అందుకోగ ఆ తర్వత వచ్చిన భలే భలే మగాడివోయ్, ఎం.సి.ఏ, నిన్నుకోరి, నేను లోకల్ ఇప్పుడు జెర్సీ సినిమాలు 1 మిలియన్ మార్క్ అందుకున్నాయి. యూఎస్ బాక్సాఫీస్ లో 8 సినిమాలతో మిలియన్ మార్క్ అందుకున్నాడు సూపర్ స్టార్ మహేష్. యూఎస్ బాక్సాఫీస్ పై మిలియన్ హీరోగా మహేష్ ట్రెండ్ సృష్టిస్తున్నాడు.    


మహేష్ సినిమాలు ఇక్కడ ఫ్లాప్ అయినా అక్కడ మిలియన్ మార్క్ అందుకుంటాయి. నాని జెర్సీ మంగళవారం కలక్షన్స్ తో 1 మిలియన్ డాలర్ క్రాస్ చేసింది. సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది. గౌతం తిన్ననూరి డైరక్షన్ లో తెరకెక్కిన జెర్సీ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: