ఈవీఎమ్ లలో బద్రపరచపడ్డ ఓటర్ల తీర్పు గురించి అందరిలోనూ టెన్షన్ పెరిగిపోతూ ఉంటే రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని మహేష్ ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఊహించని విధంగా అడ్డంకిగా మారడం హాట్ టాపిక్ గా మారింది. వచ్చేనెల 9వ తారీఖున విడుదల కాబోతున్న ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను వేలాది మంది అభిమానుల మధ్య హైదరాబాద్ ఎల్ బి స్టేడియంలో నిర్వహించాలని చాల ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.

అయితే అక్కడ తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఈవీఎమ్ లు అన్నీ కట్టుదిట్టమైన భద్రత మధ్య అక్కడ ఉంచడంతో సెక్యూరిటీ జోన్ గా మారిపోయిన ఆ ప్రదేశంలో సినిమా ఫంక్షన్ లు వద్దు అని అధికారులు ‘మహర్షి’ నిర్మాతల అభ్యర్ధలను త్రోసిపుచ్చినట్లు టాక్. దీనితో భాగ్యనగరం చివరి ప్రాంతంలో ఉన్న కొన్ని బహిరంగ స్టేడియంలలో ‘మహర్షి’ ఫంక్షన్ ను నిర్వహించాలని భావించినా ఈమధ్య తరుచు హైదరాబాద్ లో సాయంత్రం సమయంలో ఈదురుగాలులు కురుస్తున్న వానలు భయపెట్టినట్లు టాక్.  

అయినప్పటికీ ధైర్యం చేసి నెక్లెస్ రోడ్ లో పీపుల్స్ ప్లాజాని వెన్యూగా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఈ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహిస్తూ మే 1న అనగా మేడే నాడు నిర్వహించబోతున్నారు. ఆరోజు హాలిడే కావడంతో మహేష్ అభిమానులు అందరూ రావడానికి అనువుగా ఉండటమే కాకుండా ఆ ఈవెంట్ ను ఛానల్స్ లో ప్రసారం చేసినప్పుడు జనం బాగా చూస్తారని ఆ డేట్ ను ఫిక్స్ చేసినట్లు టాక్.

సెంటిమెంట్ రీత్యా ఈ ఈవెంట్ కు మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో పాటు చరణ్ జూనియర్ లను కూడా అతిధులుగా పిలవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్. ఇది ఇలా ఉంటే ఈమూవీ ట్రైలర్ ను ఈ వీకెండ్ లో విడుదల చేయాలి అని భావించినా జనం అంతా హాలీవుడ్ మూవీ `అవెంజర్స్ ఎండ్ గేమ్` మ్యానియాలో ఉండటంతో ఆ హడావిడి మధ్య ‘మహర్షి’ ట్రైలర్ ను పట్టించుకోరనీ ట్రైలర్ ను కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నాదే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: