తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఈ మద్య వరుస విజయాలతో దుమ్మురేపుతున్నారు.  గత సంవత్సరం ‘భరత్ అనే నేను’చిత్రంతో మంచి హిట్ అందుకున్నారు.  తాజాగా నిర్మాత, దర్శకుడు వంశి పైడిపల్లి డైరెక్షన్ లో ‘మహర్షి’అనే చిత్రంలో నటిస్తున్నాడు మహేష్ బాబు.  ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు..లిరికల్ సాంగ్స్ కి , టీజర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది.  


తాజాగా 'మహర్షి' చిత్రం నుండి 'పదపదరా' సాంగ్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఆకట్టుకుంటుండగా శంకర్ మహదేవన్ తన గాత్రంతో అలరించారు.  రచయిత శ్రీమణి పాటకు మంచి సాహిత్యం అందించి చిత్ర థీమ్ ఏమిటనేది సవివరంగా చెప్పారు.  మే 1వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించి, 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 


ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ చిత్రం నుంచి 'పదరా .. పదరా .. పదరా .. నీ అడుగుకి పదునుపెట్టి పదరా' అనే పాట యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం .. శ్రీమణి సాహిత్యం .. శంకర్ మహదేవన్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. ఇంతకుముందు వదిలిన 3 పాటలకు ఓ మాదిరి రెస్పాన్స్ ఉండటంతో, ఈ పాటపైనే ఈచిత్రం టీమ్ ఆశలు పెట్టుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: