స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితం పై రూపొందింపబడుతున్న ‘సైరా’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ఈమూవీకి సంబంధించి అనుష్క సహకారం లభిస్తుందా లేదా అన్న విషయమై ఇంకా మెగా కాంపౌండ్ కు అనుష్క నుండి క్లారిటీ రావడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. 

ఈకథ ప్రధమ స్వాతంత్రోద్యమం జరిగిన 18వ శతాబ్దానికి చెందినది కావడంతో ఈ మూవీ కథలోకి ప్రేక్షకులను నేరుగా తీసుకు వెళ్ళకుండా ఒక పాత్ర చేత అప్పటి కథను ఫ్లాష్ బ్యాక్ గా చెప్పించాలని ఆలోచన సురేంద్ర రెడ్డికి వచ్చినట్లు టాక్. ‘సైరా’ హిందీలో కూడ విడుదల అవుతున్న నేపధ్యంలో ‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన అనుష్క చేత ఈమూవీ కథను చెప్పిస్తే బాగుంటుందనే ఆలోచనతో అనుష్కతో చర్చలు జరుపుతున్నట్లు టాక్.

అయితే ఈ సూచనకు అనుష్క నుండి ఇంకా పూర్తిగా స్పందన రాకపోవడంతో నేరుగా చరణ్ రంగంలోకి దిగి ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అనుష్క పాత్రను ఇప్పటి తరం పాత్రగా చూపెడతారా లేదంటే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఒక మహిళ పాత్రగా చూపెడతారా అన్న విషయమై ఇంకా క్లారిటీ లేదు. 

ఈసినిమాకు సంబంధించి షూటింగ్ ఎట్టి పరిస్తుతులలోను మే నెలాఖరుకు పూర్తి చేయాలి అన్న టార్గెట్ తో పరుగులు తీస్తున్న పరిస్థుతులలో అనుష్క నటించే సన్నివేశాల షూటింగ్ ను కూడ వచ్చేనెల షూట్ చేస్తారని తెలుస్తోంది. ‘భాగమతి’ మూవీ తరువాత అనుష్క కు తెలుగులో చాల సినిమాల ఆఫర్లు వస్తున్నా ఆమె ఒప్పుకోవడం లేదు. అయితే కేవలం మెగా కాంపౌండ్ ఒత్తిడి వల్ల అనుష్క ఈ పాత్ర విషయమై ఆలోచనలలో పడ్డట్లు తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: