కోలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుద్ రవిచంద్రన్ అక్కడ సూపర్ ఫాం కొనసాగిస్తున్నాడు. త్రీ సినిమాలో వై దిస్ కొలవెరి ది అంటూ ప్రపంచాన్ని తన సంగీతంతో ఉర్రూతలూగించిన అనిరుద్ ఆ తర్వాత తమిళంలో స్టార్ మ్యుజిషియన్ గా మారాడు. తమిళంలో యువ హీరోలకు, స్టార్ హీరోలకు మొదటి ఆప్షన్ అతనే.


ఇక తెలుగులో కూడా అనిరుద్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. త్రివిక్రం, పవన్ కళ్యాణ్ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించాడు. బయటికొచ్చి చూస్తే టైమేమో 3 ఓ క్లాక్ అంటూ ట్రెండీ మ్యూజిక్ ఇచ్చినా సినిమా మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత త్రివిక్రం, ఎన్.టి.ఆర్ అరవింద సమేత సినిమాకు ముందు అనిరుద్ మ్యూజిక్ అనుకున్నా అజ్ఞాతవాసి రిజల్ట్ చూసి వద్దనేశారు. 


రీసెంట్ గా నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమాతో మరోసారి అనిరుద్ తన స్టామినా ఏంటో చూపించాడు. గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వచ్చిన జెర్సీ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ చాలా హెల్ప్ అయ్యింది. సినిమాలో ఒకటి రెండు సాంగ్స్ మాత్రమే బాగున్నా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం దుమ్ముదులిపేశాడు. జెర్సీతో అనిరుద్ అంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు.


అజ్ఞాతవాసి తర్వాత అతనికి ఛాన్సులు ఇవ్వడానికి భయపడగా ఫైనల్ గా జెర్సీ రిజల్ట్ అనిరుద్ కు తెలుగులో మంచి అవకాశాలు వచ్చేలా చేస్తుందని చెప్పొచ్చు. తనని చూసి నవ్విన వాళ్లకే సమాధానంగా మారిన అనిరుద్ ఇక మీదట కూడా తన రేంజ్ కు తగినట్టుగా మ్యూజిక్ అందిస్తాడని ఆశిద్దాం.



మరింత సమాచారం తెలుసుకోండి: