మెగా కాంపౌండ్ లో ఒకసారి ఎంటర్ అయితే ఇక వారికి అవకాశాల వెళ్లువ మొదలైనట్టే. ఒక మెగా హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకుంటే వరుసగా వారి సినిమాల్లోనే వస్తాయి. అలానే ఇప్పుడు యాంకర్ అనసూయకు మెగా కాంపౌండ్ నుండి వరుస అవకాశాలు వస్తున్నాయి. సాయి ధరం తేజ్ విన్నర్ సినిమాలో సూయ సూయ సూయ పాటలో తేజ్ తో ఆడి పాడిన అనసూయ ఆ తర్వాత రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అదరగొట్టింది.


ఇప్పుడు మళ్లీ అనసూయకు మెగా ఛాన్స్ వరించిందని తెలుస్తుంది. అదికూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అవకాశాన్ని పట్టేసింది ఈ అమ్మడు. సైరా తర్వాత చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాలో అనసూయ ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందట. కచ్చితంగా ఇది అనసూయకు లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు.


బుల్లితెర మీద జబర్దస్త్ షోతో పాపులర్ అయిన అనసూయ సిల్వర్ స్క్రీన్ పై కూడా తన టాలెంట్ చూపిస్తుంది. ఈమధ్యనే ఆమె లీడ్ రోల్ లో కథనం సినిమా వస్తుంది. ఆ సినిమాతో పాటుగా మరికొన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఏది ఎలా ఉన్నా మెగాస్టార్ మూవీ ఛాన్స్ రావడం మాత్రం అమ్మడి అదృష్టమని చెప్పాలి.


జబర్దస్త్ తో పాటుగా సినిమా ఈవెంట్లకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అనసూయ ఇద్దరి పిల్లల తల్లి అయినా సరే ఇప్పటికి కుర్రళ్ల హృదయాలను గిలిగింతలు పెట్టే అందంతో అదరగొడుతుంది. యాంకర్స్ లో ఉదయభాను తర్వాత హాట్ క్రేజ్ తెచ్చుకున్నది అనసూయానే అని చెప్పొచ్చు. మెగాస్టార్ సినిమాలో అనసూయ ఎలా సర్ ప్రైజ్ చేస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: