తెలుగు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటున్న కామెడీ షో ‘జబర్ధస్త్’.  ఈ ప్రోగ్రామ్ మొదలైన్నప్పటి నుంచి తెలుగు టెలివిజన్ లో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి.  ముఖ్యంగా యాంకరింగ్ వ్యవస్థలో కూడా ఎన్న నవీన మార్పులు సంతరించుకున్నాయి.  ఒక దశలో బుల్లితెరపై ఇప్పటికీ దీనిని ఢీకొట్టగల షో లేదంటే అతిశయోక్తి కాదు.  ప్రతి గురువారం ప్రసారమయ్యే 'జబర్దస్త్‌'కు మరిన్ని నవ్వులు జోడించి శుక్రవారం 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' అదనపు నవ్వులు పంచుతోంది.  అప్పటి వరకు స్టూడియోల చుట్టు తిరిగిన కొంత మంది ఔత్సాహిక కళాకారులు ఇప్పుడు వెండి తెరపై వెలిగిపోయేలా చేసింది ఫ్లాట్ ఫామ్ జబర్ధస్త్.  


ఇక జబర్ధస్త్ లో మొదటి నుంచి జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు మెగాబ్రర్ నాగబాబు, రోజా. ఆరేళ్ల జబర్ధస్త్ ప్రయాణంలో ఎన్నో సార్లు వీరు మానేస్తారు..వెళ్లిపోతారు అని వార్తలు హల్ చల్ చేసినా..వీరిద్దరి స్థానాలు పదిలంగానే ఉన్నాయి.  ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాగబాబు జనసేన పార్టీ నుంచి నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.  ఎమ్మెల్యేగా మరోసారి నగరి నుంచి రోజా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.   కాగా, ఈ సందర్భంగా 'రాజకీయాల్లో బిజీగా ఉన్నా, 'జబర్దస్త్‌' షో చేస్తారా.. లేక మానేస్తారా' అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు నాగబాబు సమాధానం ఇచ్చారు. 

పోలింగ్ జరుగుతున్న సమయంలో నేను ఓ పోలింగ్ బూత్ వద్దకు వెళ్లగా ఓ ముసలావిడ నన్ను అడిగారు..బాబూ నువ్వు రాజకీయాల్లోకి వస్తే జబర్ధస్త్ మానేస్తావా అని..వినోదాన్ని పంచుతూ నాకు కొంత ఆదాయాన్ని ఇస్తోంది. దానికంటే ప్రజల్ని నవ్వించే ఒక షోలో భాగం కావడం నాకు నచ్చింది.. గుర్తింపు తెచ్చింది. నేను ఈ షోకు కేటాయించేది నాలుగైదు రోజులు. ఒక వేళ నేను ఎంపీగా ఎన్నికైనా కూడా నాకు ఎటువంటి నష్టం జరగదు. తప్పకుండా ఈ షో కంటిన్యూ చేస్తానని చెప్పారు.   అయితే, సినిమాల్లో మాత్రం నటించలేకపోవచ్చు. ప్రజలకు నచ్చిన షో కాబట్టి తప్పకుండా చేస్తా..ఆ అభిమానికి చెప్పారు నాగబాబు. 


మరింత సమాచారం తెలుసుకోండి: