యాంకర్ కమ్ ఆర్టిస్ అనసూయ మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి. బుల్లితెరపైనే కాదు.. పెద్ద తెరపైనా ఇటీవల అనసూయ తన విశ్వరూపం చూపిస్తూనే ఉంది. ఒక్కొక్కటిగా మంచి ఛాన్సులతో తన క్రేజ్ పెంచుకుంటోంది అనసూయ. 


తాజాగా ఆమె మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు ఫిలింనగర్‌ వర్గాలు చెబుతున్నాయి. చిరంజీవి, కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాలో అనసూయ ఓ కీ రోల్‌ కు ఓకే చెప్పేసిందట. చిరు సినిమాలో అవకాశం కావడం, తన పాత్ర కథానాయిక పాత్రకు సమానంగా ఉండటంతో అనసూయ వెంటనే ఓకే చెప్పేసిందట. 

చిరంజీవి ప్రస్తుతం బిజీగా ఉన్న సైరా నరసింహారెడ్డి షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందట. అనసూయ ఇప్పటికే చిరంజీవి తనయుడు రాంచరణ్‌ రంగస్థలం  సినిమాలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 

ఈ సినిమా ఆమె కెరీర్‌లోనే ఓ గొప్ప సినిమాగా మిగిలింది. ఈ సినిమా తర్వాత మరో మంచి ఛాన్స్ అనసూయ దక్కించుకుందని ఫిలిం వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: