గతంలో మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భరద్వాజ్ అనే అతని ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఐతే కొన్ని కారణాల వల్ల వివాదాల వల్ల శ్రీజ భరద్వాజ కి విడాకులు ఇచ్చి ఇటీవల కళ్యాణ్ అనే అతన్ని రెండో వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కళ్యాణ్ దేవ్-శ్రీజ దంపతులకు ఇటీవల ఒక చిన్న పాప కూడా పుట్టడం జరిగింది. ఆ పాపకు నవిష్క అనే పేరు పెట్టారు.

ఆ క్షణం నుంచే హ్యాపీ మూడ్లో కళ్యాణ్ దేవ్

ఈ నేపథ్యంలో తాజాగా ఇటీవల ఆ పాపకు నాలుగు నెలలు పూర్తయిన సందర్భంగా కళ్యాణ్ దేవ్ తన సోషల్ మీడియా పేజీ ద్వారా ఫోటోస్ రిలీజ్ చేశారు. నవిష్క ఫస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులు ఈ చిన్నారిని ఆశీర్వదిస్తూ లైక్స్, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. శ్రీజ, కళ్యాణ్ వివాహం 2016, మార్చి 28న జరిగింది. దాదాపు రెండున్నరేళ్ల గ్యాప్ తర్వాత ఈ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు.

రెండున్నరేళ్ల తర్వాత తల్లిదండ్రులుగా ప్రమోషన్

మొత్తం మీద చిరంజీవి మనవరాలు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బయటకు రావడంతో మెగా అభిమానులు మంచి సంతోషంగా ఉన్నారు. మరోపక్క చిరంజీవి మనవరాలు అనే బయటికి ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  ఇదిలావుండగా విజేత అనే సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ ఆ సినిమాతో పరవాలేదు అనిపించుకుని ఇప్పుడు తన తర్వాత సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టారు.



మరింత సమాచారం తెలుసుకోండి: