త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ షూటింగ్ మొన్నటి నుండి వేగంగా హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలలో జరుగుతోంది. ఈమూవీ షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని ఈఏడాది చివరి నుండి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటించబోయే సినిమాకు ఇప్పటికే మానసికంగా బన్నీ సిద్ధం అవుతున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో వేణు శ్రీరామ్ కథ విషాదాంతంతో ఉంటుందని ఆమూవీలో భావోద్వేగాలు చాల ఎక్కువగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. 

దీనితో ఎలర్ట్ అయిన ఈమూవీ నిర్మాతలు ఈసినిమా గురించి నెమ్మదిగా ఇండస్ట్రీ వర్గాలు ద్వారా లీకులు ఇస్తున్నారు. తెలుస్తున్న సమాచారం వరకు దిల్ రాజ్ బన్నీల మూవీ ప్రాజెక్ట్ ‘ఐకాన్’ ప్రచారంలో ఉన్నట్లుగా ఒక ఫిలిప్పైన్స్ సినిమాకు అనుకరణ కాదని ఈమూవీ కథ వేరు అంటూ లీకులు వస్తున్నాయి. ఈమూవీ కథ ఒక హైవే జర్నీ చుట్టూ తిరుగుతుందని టాక్. ఈమూవీలో బన్నీ తన బైకు పోతే పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ఇస్తాడట. 

అయితే బన్నీ ఇచ్చిన కంప్లయింట్ ను పోలీసు డిపార్ట్ మెంట్ పట్టించుకోకపోతే ఆ డిపార్ట్ మెంట్ ను షేక్ చేసే విధంగా బన్నీ ఆడే మైండ్ గేమ్ ఈసినిమాలో కీలకం అని తెలుస్తోంది. అక్కడి నుంచి ఎన్నో నాటకీయ మలుపుల తీసుకుని మొత్తం సినిమా అంతా ‘జర్నీ’ బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుందని సమాచారం. 

అయితే ఇలాంట్ కథలు తెలుగులో చాల వచ్చినా ఈమూవీలో ఉన్న ట్విస్ట్ లు ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలోను రాకపోవడమే కాకుండా ఈమూవీ స్క్రీన్ ప్లే ఈసినిమాకు హీరోగా మారుతుంది అని అంటున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం అంగీకరించిన మూడు సినిమాలు మూడు డిఫరెంట్ జోనర్స్ కావడంతో బన్నీ నుండి రాబోయే మూడు సినిమాలు మూడు యాంగిల్స్ లో కనిపిస్తూ అభిమానులకు జోష్ ను కలిగించేలా మరబోతున్నాయి అన్నది వాస్తవం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: