టాలీవుడ్ సీనియ‌ర్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణకు రెండు ఫార్మాట్లు బాగా క‌లిసి వ‌చ్చాయి. బాల‌య్య క‌త్తి ప‌ట్టి ఫ్యాక్ష‌న్ స్టోరీతో సినిమా చేస్తే సూప‌ర్ హిట్. స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహానాయుడు, సింహా, లెజెండ్ లాంటి సినిమాలు అన్ని ఫ్యాక్ష‌న్‌, పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కిన‌వే. ఈ సినిమాలు అన్ని బాల‌య్య కెరీర్‌లో సూప‌ర్ డూప‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లుగా నిలిచిపోయాయి. ఇక బాల‌య్యకు లాఠీ కూడా కలిసొచ్చింది. బాల‌య్య లాఠీ ప‌డితే సినిమా హిట్ కొట్టింది. 


ఇన్స్ పెక్టర్ ప్రతాప్ తో మొదలుకుని రౌడీ ఇన్స్ పెక్టర్ గా ఆయన అందుకున్న హిట్లు బ్లాక్ బస్టర్లు ఎన్నో ఉన్నాయి. ఇక త‌మిళ్ సామీకి రీమేక్ బాల‌య్య 2004లో చేసిన ల‌క్ష్మీన‌ర‌సింహా సినిమా అయితే రికార్డులు తిర‌గ‌రాసింది. ఇక బి.గోపాల్ డైరెక్ష‌న్‌లో బాల‌య్య న‌టించిన రౌడీఇన్‌స్పెక్ట‌ర్ అప్ప‌ట్లోనే బాక్సాఫీస్‌ను షేక్ చేసి ప‌డేసింది. ఇక ఇదే పోలీస్ పాత్ర‌లో బాల‌య్య చేసిన కొన్ని సినిమాలు ప్లాప్ కూడా అయ్యాయి.


ఇప్పుడు మ‌రోసారి బాల‌య్య కేఎస్‌.ర‌వికుమార్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కే సినిమాలో ఖాకీ డ్రెస్ వేస్తున్నాడు.  కేఎస్ రవికుమార్. సినిమాలో బాలయ్య పాత్ర అక్కడక్కడ నెగెటివ్ షేడ్స్ లో కూడా కనిపిస్తుందట. ఎస్పి రంజిత్ కుమార్ రానా పేరుతో చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఈ రోల్ ఉంటుంద‌ని స‌మాచారం. ఇక ఈ సినిమాకు రౌడీ పోలీస్ అనే ఫుల్ మాస్ టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు టాక్‌. మ‌రి ఈ సారి ఖాకీ చొక్కాలో బాల‌య్య ఏం చేస్తాడో ?  చూడాలి. సీ క‌ళ్యాణ్ ఈ సినిమాకు నిర్మాత‌.


మరింత సమాచారం తెలుసుకోండి: