రియల్ లైఫ్ భార్యాభర్తలు.. రీల్ లైఫ్ లో తమ పాత్రలు పోశిస్తే ఆ కిక్కే వేరు. మజిలీ సినిమాలో అదే మ్యాజిక్ జరిగింది. ఏమాయ చేసావె సినిమాలో కలిసి నటించి ఇద్దరు మనసులు మార్చుకున్న నాగ చైతన్య, సమంత కొన్నాళ్లు వారి ప్రేమను దాచిపెట్టి ఫైనల్ గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ఇద్దరు కెరియర్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉన్నారు.


ఈమధ్యనే శివ నిర్వాణ డైరక్షన్ లో మజిలీ సినిమాలో కలిసి నటించారు నాగ చైతన్య, సమంత. సినిమాలో ఇద్దరి పాత్రలకి మంచి పేరు వచ్చింది. పూర్ణగా చైతు, శ్రావణిగా సమంత మంచి పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. మజిలీ సినిమా చైతు కెరియర్ లో బెస్ట్ హిట్ అంటున్నారు. ఇదిలాఉంటే ఈ మూమెంట్ లోనే ఇద్దరు కలిసి మరో సినిమా చేయాలని చూస్తున్నారట.


ఆరెక్స్ 100 డైరక్టర్ అజయ్ భూపతి డైరక్షన్ లో మహాసముద్రం సినిమా నాగ చైతన్య చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతను అడుగుతున్నారట. ఎలాగు మజిలీ హిట్ అయ్యింది కాబట్టి ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు వారు కూడా రెడీ అన్నట్టు తెలుస్తుంది. పెళ్లి తర్వాత సమంత మునుపటి కంటే ఎక్కువ ఫాంలో ఉందని చెప్పొచ్చు.


కచ్చితంగా సమంత హీరోయిన్ గా ఉంటే చైతు సినిమాకు అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు. అయితే ఇదంతా బాగానే ఉంది కాని సమంత లేనిదే చైతు హిట్టు కొట్టలేదా అన్న టాక్ కూడా ఒకటి బాగా వినపడుతుంది. ఎవరు చేసే కామెంట్స్ వారు చేస్తున్నా చైతు హిట్ అవ్వాలి అంటే సమంత కూడా అందులో భాగమైతే బెటర్ అని ప్రేక్షకుల అభిప్రాయం. మజిలీ తర్వాత ఈ మహా సముద్రం ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాలో నాగ చైతన్య పోలీస్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: