‘డిగ్రీ కాలేజీ’ పేరుతో త్వరలో విడుదలకాబోతున్న చిన్న సినిమా ట్రైలర్ ఆవిష్కరణ సభకు అతిధిగా వచ్చిన జీవిత నేటి సినిమాలలో శృతిమించి పోతున్న శృంగార సన్నివేశాలు లిప్ లాక్ సీన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈమూవీ ట్రైలర్ చూసిన తరువాత షాక్ అయిన జీవిత ఆమూవీ దర్శకుడుకి ఓపెన్ గానే క్లాస్ పీకింది. 

ఇలాంటి దిగజారిన సీన్స్ తో ఉన్న ట్రైలర్ ఆవిష్కరణకు తనలాంటి వ్యక్తులను పిలవకూడదని తాను రిలీజ్ చేసిన ట్రైలర్ లో ఉన్న శృంగార సన్నివేశాలు చూసి షాక్ అయ్యానని అంటూ ఒక కేంద్ర సెన్సార్ బోర్డ్ మెంబర్ చేత ఇలాంటి బూతు ట్రైలర్ విడుదల చేయించడం తనకు షాకింగ్ గా మారిందని అంటూ ఆమె ఆశ్చర్యపడింది.  ఎవరైనా బాత్రూంలో స్నానం చేసి బెడ్ రూమ్ లో పడుకుని హాలులో కూర్చుంటారనీ అలాంటిది స్వేచ్చ ఉంది కదా అనీ హాలులో కూర్చుని అందరు చూస్తుండగా స్నానం చేయరు కదా అంటూ ఈమూవీ దర్శకుడు పై జీవిత ఘాటైన విమర్శలు చేసింది. 

ప్రతి మనిషి జీవితంలో శృంగారం సెక్స్ ఉంటాయనీ అంటూ కానీ బట్టలు విప్పుకోవడం అమ్మాయిలు అబ్బాయిల మీద ఎక్కి కూర్చోవడం వంటీ సీన్లు నేడు చాలసినిమాలలో కామన్ అయిపోయాయి  అంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తపరిచింది. అయితే నేటి యంగ్ డైరెక్టర్లు అలలంటి సీన్స్ సహజత్వం కోసం ఎందుకు తీయకూడదు అని మొండిగా వాదిస్తున్న విషయాలను వివరిస్తూ ఇంత అనుభవం ఉండి కూడ తాను ఏమీ మాట్లాడలేకపోతున్నాను అన్న తన ఆవేదనను జీవిత వ్యక్తపరిచింది.  

మరికొందరైతే ఇలాంటి సన్నివేశాలు సోషల్ మీడియాలో, టీవీల్లో కనిపించడం లేదా అంటూ వాదిస్తున్న విషయాలను వివరిస్తూ  కొన్ని వందల మంది మధ్యలో మనం శృంగారం చేయం కదా అని అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఆలోచింప చేసేవిగా ఉన్నాయి. వాస్తవానికి ఇలాంటి సన్నివేశాలు ఉండకూడదు అని సెన్సార్ బోర్డ్ అడ్డంకులు చెపితే అది తమ బావ వ్యక్తీకరణ స్వేచ్చ అంటూ కొందరు మీడియా సమావేశాలు పెడుతూ మరికొందరు న్యాయస్థానం మెట్లు ఎక్కుతూ గందరగోళం సృష్టిస్తున్న నేపధ్యంలో ఇలాంటి సినిమాల వల్ల సమాజం ఏమైపోతుందో అన్న భయం తస్కు కలుగుతోంది అంటు జీవిత చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: