తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు ‘రాజకుమారుడు’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.  ఈ సినిమా తర్వాత సరైన మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంది మాత్రం కృష్ణ వంశి దర్శకత్వంలో వచ్చిన ‘మురారి’.  ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘పోకిరి’చిత్రం మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  త్రివిక్రమ్ దర్శకత్వంలో అతడు చిత్రంతో ఫ్యామిలీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

ఇలా మహేష్ బాబు కెరీర్ లో ఒక్కో దర్శకుడు ఒక్కో ఇమేజ్ తీసుకువచ్చారని..ఇటీవల మహర్షి ఆడియో వేడుకలో తన దర్శకులకు థ్యాంక్స్ తెలిపారు.  
ఇక వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’చిత్రంలో నటిస్తున్నాడు మహేష్ బాబు.  ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తుంది.  మే 9న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మహేష్ 25వ సినిమా కావడంతో 'మహర్షి'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. ఎలాంటి కట్స్ లేకుండా సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు.  


ఓ బిలీనియర్ సామాన్య రైతుగా మారి విలన్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ సినిమా కాన్సెప్ట్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్‌ రాజు, పీవీపీ, అశ్వనీదత్‌ సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: