జీవిత రాజశేఖర్ తన కూతురు శివానీని హీరోయిన్ గా చేయాలని చాల ఆశలు పెట్టుకుని మొదలు పెట్టిన ‘2 స్టేట్స్’ తెలుగు రీమేక్ నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడం జీవితకు షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. చేతన్ భగత్ వ్రాసిన నవల ఆధారంగా బాలీవుడ్ లో విడుదలైన ఈమూవీ రీమేక్ ను అత్యంత ఘనంగా ప్రారంభించి సగం పైగా షూట్ చేసారు. 

వెంకట్ రెడ్డి అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో ఇప్పటి వరకు నిర్మాణం జరుపుకున్న ఈమూవీ అవుట్ పుట్ ను చూసి ఈమూవీ దర్శకుడు అడవి శేషు షాక్ అయి ఈమూవీలో తాను నటించను అని వెళ్లిపోవడంతో ఈమూవీ మధ్యలో ఆగిపోయింది. దీనితో రంగంలోకి దిగిన జీవిత ఈమూవీని తన సొంత నిర్మాణ సంస్థ బ్యానర్ పై నిర్మించి తానే దర్శకత్వం వహిస్తానని అడవి శేషుతో రాయబారాలు చేసినప్పుడు ఆమెకు అతడి నుండి ఊహించని సమాధానం వచ్చినట్లు టాక్. 

ఈమూవీ జీవిత తన సొంత నిర్మాణ సంస్థ బ్యానర్ లో నిర్మిస్తే తనకు అభ్యంతరం లేదనీ అయితే ఈమూవీకి జీవిత కాకుండా తాను సూచించిన  మరో యంగ్ డైరెక్టర్ చేత దర్శకత్వం వహింప చేస్తే బాగుంటుంది అనీ శేషు జీవితకు సున్నితంగా సూచించినట్లు టాక్. అంతేకాదు ఇప్పటి వరకు నిర్మాణం జరుపుకున్న మొత్తం సీన్స్ అన్నీ మళ్ళీ రీ షూట్ చేయాలని కూడ అడవి శేషు జీవితకు కండిషన్స్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనితో షాక్ అయిన జీవిత తన కూతురు శివానీ విషయంలో మొదటి సినిమా విషయంలోనే ఎదురీత ప్రారంభం అవ్వడంతో జీవిత సెంటిమెంటల్ గా ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థుతులలో తన కూతురు శివానీకి అవకాశాలు ఇమ్మని జీవిత తనకు తెలిసిన దర్శక నిర్మాతలతో రాయబారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: