సన్నీ లియోన్ కొంచెం గ్యాప్ ఇచ్చి ఐటెం సాంగ్ తో అభిమానుల ముందుకు వచ్చేసింది. అయితే ఐటెం సాంగ్ ఓ రేంజ్ లో ఉందని చెప్పాల్సిందే. యూత్ కళ్లు భైర్లు కమ్మే మేని విరుపులతో ఒకటే పరేషాన్ చేసింది. ఇంతకీ ఏమా ఐటెమ్ గీతమ్ కథ? అన్నది తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఓవైపు స్టార్ స్టక్ బిజినెస్ మరోవైపు దత్త పుత్రుల పెంపకం- పర్సనల్ వ్యాపకాలతో బిజీ అయిపోయిన సన్నీ పూర్తి స్థాయి నాయికగా నటించకుండా పార్ట్ టైమ్ జాబ్ పైనే దృష్టి సారించింది.


ఆ క్రమంలోనే ఇరుగు పొరుగు పరిశ్రమల్లో తనవైపు వచ్చిన క్రేజీ ఐటెమ్ నంబర్లను అస్సలు విడిచిపెట్టడం లేదు. అప్పట్లో మంచు మనోజ్ సినిమాలో కామియో & సాంగ్ లో షివరింగ్ ఇచ్చే పెర్ఫామెన్స్ ఇచ్చిన ఈ బ్యూటీ..  ఇటీవలే రాజశేఖర్ `పీఎస్ వీ గరుడవేగ`లోనూ `డియో డియో..` అంటూ ఐటెమ్ నంబర్ తో మైమరిపించింది.కేవలం తెలుగులోనే కాదు అటు మలయాళంలోనూ అడపాదడపా స్టార్ హీరోల సినిమాల్లో ఐటెమ్ నంబర్లకు సంతకాలు చేస్తూ వేడి పెంచుతోంది.


మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కథానాయకుడిగా నటించిన `మధుర రాజా` ఇటీవలే రిలీజై మిశ్రమ స్పందనలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సన్నీ `మోహ ముందిరి` అంటూ అదిరిపోయే ఐటెమ్ నంబర్ లో నర్తించింది. ఇదివరకూ బిట్ సాంగ్ ని మాత్రమే రిలీజ్ చేసిన టీమ్ ఈ పూర్తి పాటను రిలీజ్ చేసింది.  బీకే హరినారాయణన్ సాహిత్యం అందించిన ఈ పాటకు ట్యాలెంటెడ్ గోపి సుందర్ సంగీతం అందించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: