అల్లరి నరేశ్ గా తెలుగు ప్రేక్షకులలో ఒక విభిన్నమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్న అల్లరోడు అతి తక్కువ కాలంలో 50 సినిమాలు నటించాడు. ఒక దశలో రాజెంద్రప్రసాద్ స్థానాన్ని ఇతడు ఆక్రమిస్తాడు అన్న ప్రచారం కూడ జరిగింది. అతడి తండ్రి ఇవివి సత్యనారాయణ జీవించి ఉన్న కాలంలో ప్రతి సమ్మర్ సీజన్ కు ఈ హీరో ఒక కామిడీ హిట్ మూవీని ఇచ్చేవాడు. 

అలాంటి ఈ కామెడీ హీరో తన తండ్రి మరణించిన తరువాత ఏర్పడిన యంగ్ హీరోల పోటీల మధ్య ఎన్ని సినిమా ప్రయోగాలు చేసినా ఏ ప్రయోగంలోను సక్సస్ కాలేకపోయాడు. చాల సంవత్సరాల క్రిందట విడుదలైన ‘సుడిగాడు’ తరువాత ఈ హీరోకి పేరుకు ఒక హిట్ కూడా లేదంటే అతడి పరిస్థితి ప్రస్తుతం ఎంత ఎదురీతలో ఉందో అర్ధం అవుతుంది. 

ఇలాంటి పరిస్థుతులలో ఎల్లుండి విడుదలకాబోతున్న ‘మహర్షి’ మూవీ ఫలితం మహేష్ కంటే నరేశ్ కు కీలకంగా మారింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఇతడి పాత్ర చిన్నదే అయినా కథకు చాల ప్రాముఖ్యత ఉన్న పాత్ర. ఇలాంటి పరిస్థుతులలో నరేశ్ ను మహేష్ తో సమానంగా ఈమూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలకు పిలుస్తూ అతడి స్థాయిని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఈ విషయంలో నరేశ్ కు మహేష్ సహకారం కూడ లభిస్తోంది అని టాక్. ‘మహర్షి’ అనుకున్న విధంగా సూపర్ సక్సస్ అయితే ఇక నరేశ్ కు వరసపెట్టి అవకాశాలు వస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. త్వరలో ఇతడు ఎస్ వి కృష్ణా రెడ్డి దర్సకత్వంలో ఒక సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్న పరిస్థుతులలో ‘మహర్షి’ విజయం నరేశ్ కు టర్నింగ్ పాయింట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు..


మరింత సమాచారం తెలుసుకోండి: