ఎన్నో కష్టనష్టాల మద్య తెరపైకి వస్తున్న అత్తారింటికి దారేది సినిమాను పవన్ కళ్యాణ్ తన లుంగీ పవర్ తో ఆదుకోబోతున్నాడట. ఇప్పటికే పైరసీతో నష్టపోయిన నిర్మాత ప్రసాద్ కు తన రెన్యుమరేషన్ ఇచ్చి ఆదుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇక మిగిలిన నష్టాన్ని ఆయన లుంగీ పవర్ తో పూడుస్తాను అంటున్నాడు.

లుంగీ పవర్ ఏంటి ఆశ్యర్యపోతున్నారా... పవన్ కళ్యాణ్ మాస్ డ్యాన్స్ చేస్తే ప్రేక్షకులు ఎంత పెట్రేగి పోతారో తెలియందేముంది. పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో లుంగీతో డ్యాన్స్ చేస్తూ ‘బాపు బొమ్మో’ అనే పాటను ఇరగ దీసాడట. ఇది మొత్తం సినిమాకే హైలెట్ అవుతుంది అంటున్నారు. ఈ పాటతో సినిమా బంపర్ హిట్టు ఖాయం, హీరోగా పవన్, నిర్మాతగా ప్రసాద్ గట్టెక్కుతారు అన్న ధీమాను సినిమా వర్తాలు వ్యక్తం చేస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: